For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ సోయా ఉప్మా రిసిపి - హెల్తీ బ్రెక్ ఫాస్ట్

|

బ్రేక్ ఫాస్ట్ ను కింగ్ గా అభివర్ణిస్తారు. మధ్యహ్నా భోజనాన్ని ప్రిన్స్ గాను మరియు రాత్రి తీసుకొనే ఆహారం ను బెగ్గర్ గాను భావిస్తారు. ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ అనేది రోజులో తీసుకొనే అతి ముఖ్యమైటువంటి ఆహారం. అందువల్ల, ఎల్లప్పుడు ఉదయం తీసుకొనే అల్పాహారం కడుపు నింపేదైయ్యుండాలి. మరియు హెల్తీ గా ఉండాలి. మీకు ఇష్టమైనదైయ్యుండాలి. అందుకు వివిధ రకాల టేస్టీ రిసిపిలున్నాయి.అయితే సోయా ఉప్మాకంటే బెటర్ గా మరేదే ఉండదేమో అనిపిస్తుంది.

సోయా ఉప్మా రిసిపి మీకు కావల్సిన న్యూట్రీషియన్స్ మరియు పోషకాలను అందిస్తుంది. సోయా ఉప్మా రిసి మీ ఎముకలను బలంగా ఉండానికి మరియు మెనుష్ట్రువల్ సైకిల్ క్రమంగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతే కాదు సోయా శక్తి అంధించడంలో మంచి ఆధారం అనిచెప్పవచ్చు. కాబట్టి సోయా ఉప్మా బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిగా మీరు ఎంపిక చేసుకోవచ్చు.

కావల్సిన పదార్థాలు:
సోయా రేకులు: ½cup
అల్లం: 1(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
రవ్వ: 1cup
పచ్చిమిరపకాయలు: 3-4 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
బీన్స్: 4(చిన్న ముక్కలుగా తరిగాలి)
క్యారెట్: 1(చిన్న ముక్కలుగా తరిగాలి)
ఉల్లిపాయ: 1 (diced)
ఆవాలు: ½tsp
శెనగపప్పు: 1tsp
ఉద్దిపప్పు: 1tsp
జీలకర్ర: ½tsp
పచ్చి వేరుశెనగ: 2 tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నీరు: 2cups
ఆయిల్: 1tsp
నిమ్మరసం: ½tsp
నెయ్యి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి బేడిచేయాలి.
2. తర్వాత అందులో ఆవాలు, శెనగపప్పు, ఉద్దిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి.
3. ఇప్పుడు అందులోనే కరివేపాకు, అల్లంతురుము వేసి కొన్ని సెకడ్లు వేగించుకోవాలి.
4. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి మరియు వెజిటేబుల్ ముక్కలు వేసి నిదానంగా వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే నీళ్ళు మరియు ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి.
6. నీరు బాగా మరుగుతున్నప్పుడు అందులో సోయా ఫ్లేక్స్ వేసి ఫ్రైయింగ్ మిశ్రమంతో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
7. తర్వాత మంట తగ్గించి, మీడియం మంట మీద ఉప్మా రెడీ అయ్యే వరకూ, ఉడకనివ్వాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి. దానివల్ల పాన్ కు అట్టుకోకుండా ఉంటుంది.
8. ఉప్మా తయారైయ్యాక అందులో నిమ్మరసం పిండి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అలాగే మీకు ఇష్టమైతే నెయ్యి కూడా చిలకరించుకోవచ్చు.

English summary

Healthy Soya Upma Recipe For Breakfast | హెల్తీ సోయా ఉప్మా రిసిపి - హెల్తీ బ్రెక్ ఫాస్ట్

There is an old saying which goes like this - Eat breakfast like a king, lunch like a prince and dinner like a beggar. Breakfast is indeed the most important meal of the day. Therefore, one should always eat something which the stomach would like. There are a number of tasty recipes for you to try out, but nothing is better than this soya upma recipe.
Desktop Bottom Promotion