హెల్తీ అండ్ టేస్టీ వెజిటేరియన్ వంటలు

పౌష్టికాహారమే శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా వుంచుతుంది. ఈ భోజనంలో శరీరానికి కావలసిన ఖనిజ పదార్థాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లతోబాటు పోషకపదార్థాలుండాలి. ఇవన్నీ కలిసున్న భోజనమే అమృతంతో సమానం. మనం తీసుకునే భోజనం ప్రకృతి సిద్ధమైనదైవుండాలి. సమపాళ్ళలో తీసుకునే శాఖాహారం శరీరానికి అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. కాయగూరల్లో అమినో ఆమ్లంతోబాటు మెగ్నీషియం కూడా వుంటుంది. విటిలో అనేక విటమిన్లు, మినిరల్స్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, పుష్కంగా ఉంటుంది. అందుకే ఇన్ని ప్రయోజనాలున్నవెజిటేరియన్ ఫుడ్స్ మీద చాలా మంది మాంసాహారులు వారి ఆహారపు అలవాట్లను మార్చుకుని వేగన్ లేదా శాఖాహారానికి మారుతున్నారు. మరి మీ మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని వెజిటేరియన్ రిసిపిలు ఇక్కడ అంధిస్తున్నాం...

థాయ్ వెజిటేబుల్ రెడ్ కర్రీ-నో స్పైసీ ఓన్లీ టేస్టీ

థాయ్ వెజిటేబుల్ రెడ్ కర్రీ-నో స్పైసీ ఓన్లీ టేస్టీ


రెడ్ కర్రీ అనే పేరుతోనే ఇది ఎంత స్పైసీగా ఉంటుందో తెలుస్తుంది. ఇది ఒక హాట్ అండ్ స్పైసీ డిష్. కానీ మీకో సర్ ఫ్రైజ్ ఏంటంటే ఈ థాయ్ రెడ్ కర్రీ అంత స్పైసీ డిష్ కాదు. మరియు ఇది చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఇది చాలా సింపుల్ డెలిషియస్ వెజిటేరియన్ రిసిపి, మీకు రెగ్యులర్ రిసిపిలతో బోర్ కొట్టినప్పుడు ఇటువంటి వంటకాలను ప్రయత్నించవచ్చు.

హైదరాబాద్ స్పెషల్ దహీ బెండీ మసాలా

హైదరాబాద్ స్పెషల్ దహీ బెండీ మసాలా


సౌత్ ఇండియన్ వంటకాల్లో బెండకాయ మసాలా చాలా పాపులర్. బెండకాయను వివిధ రకాలుగా..వివిధ పద్థతుల్లో తయారుచేవచ్చు. ఈ బేండి మాసాలకు క్రీమీ మరియు కొద్దిగా పుల్లగా ఉండే ఈ బేండి మసాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని హైదరాబాదీ దహీబెండీ మసాలా అంటారు. హైదరాబాద్ దహీ బెండీ మసాలాను పెరుగుతో తయారుచేస్తారు. చిక్కగా ఉండే పెరుగు, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ ఈ వంటకు మరింత అద్భుతమైన టేస్ట్ ను అంధిస్తుంది.

గుజరాతీ ఆలూ సబ్జి కాంబినేషన్ ఫర్ వెజ్ ఫులావ్

గుజరాతీ ఆలూ సబ్జి కాంబినేషన్ ఫర్ వెజ్ ఫులావ్


బంగాళదుంపలతో తయారు చేసిన వంటలంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు చెప్పండి ? బంగాళదుంపలతో వివిధ రకాల వంటకాలను తయారు చేయవచ్చు . వీటితో తయారు చేసే అన్ని రకాల వంటాలు మంచి ఫ్లేవర్ తో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటాయి. బంగాళదుంపలతో వివిధ రకాల ఎక్స్ పిరిమెంట్స్ చేసి కొత్త టేస్ట్ ను రుచి చూడవచ్చు. ఈ ఆలూ సబ్జీ పూర్తి గుజరాతీ వంటకాం.

బంగాళదుంప పచ్చిబఠానీ కర్రీ

బంగాళదుంప పచ్చిబఠానీ కర్రీ


చాలా మంది తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మంచి ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. అంతే కాదు వారు తినే ఆహారం టేస్టీగా ఉండాలని కోరుకుంటారు. బంగాళదుంప కర్రీ ఆరోగ్యానికి మంచిది.

క్యాబేజ్ కూటు-స్పెషల్ టేస్టీ సైడ్ డిష్

క్యాబేజ్ కూటు-స్పెషల్ టేస్టీ సైడ్ డిష్


క్యాబేజీతో వివిధ రకాల వంటలు, వండుతారు. ఫ్రై, సాంబార్, మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్స్, సూప్స్ లోనూ రకరకాలుగా తింటుంటారు. అయితే కొంచెం వెరైటీగా ఓ స్పెషల్ సైడ్ డిష్ క్యాబేజ్ కూటును తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇది ప్లెయిన్ రైస్, చపాతీ, పూరీలలోనికి చాలా రుచికరంగా ఉంటుంది. మరియు ఆరోగ్యానికి మంచిది కూడా.

దాల్ మఖానీ తయారు చేడం ఎలా?

దాల్ మఖానీ తయారు చేడం ఎలా?


దాల్ మఖానీ పంజాబీ స్పెషల్ డిష్ చాలా వెరైటీగా టేస్టీగా ఉంటుంది. దాల్ మఖానీ వివిధ చిరుధాన్యాలతో తయారు చేస్తారు. పంజాబీయులకు చాలా ఇష్టమైన వెజిటేరియన్ వంటకం. దీన్ని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.

కాశ్మిర్ స్పెషల్ -దమ్ క్యాప్సికమ్

కాశ్మిర్ స్పెషల్ -దమ్ క్యాప్సికమ్


దమ్ రిసిపిలు మన ఇండియన్ కల్చర్ లో చాలా ఫేమస్. ఉదాహరణకు దమ్ బిర్యానీ, ఆలూ దమ్, దమ్ చికెన్ వంటివి చాలా ఫేమస్. దమ్ ఆలూ నార్త్ ఇండియాలోనే కాదు, సౌత్ ఇండియాలో కూడా చాలా ఫేమస్. కొంచెం వెరైటీగా వెజిటేరియన్ దమ్..క్యాప్సికమ్ దమ్ కొన్ని మసాల దినుసులను ఉపయోగించి చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.

మూంగ్ దాల్ ఖడీ

మూంగ్ దాల్ ఖడీ


ఖడీ ఒక ఫేవరెట్ నార్త్ ఇండియన్ రిసిపి. ఇది వెజిటేరియన్స్ ఒక మంచి ఎంపిక. ఇటువంటి స్పెషల్ రిసిపిలో శ్రావణ మాసంలో అధికంగా తయారు చేస్తుంటారు. వీటిని ప్రత్యేకంగా చేయడం, ముఖ్యంగా ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకుండాలనే తయారు చేసే సాంప్రదాయం చాలా మందిలో ఉంది.

షహీ కాజు సబ్జీ-మొఘలాయ్ స్పెషల్

షహీ కాజు సబ్జీ-మొఘలాయ్ స్పెషల్


ముఘలాయ్ కుషన్ నుండి ఒక రీగల్ డిష్. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ను, క్రీమి టెక్చర్ ను ఇస్తుంది. ఇందులో మసాలా దినుసులు ఉపయోగించడం వల్ల మంచి ఆరోమా వాసను ఇస్తుంది.ఇది మరింత టేస్ట్ గా ఉంటుంది.

వెరీ టేస్టీ కొంకనీ సాంబార్

వెరీ టేస్టీ కొంకనీ సాంబార్


ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంస్కృతి ఉంటుంది. అంతే కాదు రుచులు కూడా విభిన్నంగా ఉంటాయి. సౌత్ ఇండియన్ వంటలు, నార్త్ ఇండియన్ వంటలన్నీ చాలా ఫేమస్ గా వర్ణించుకుంటుంటారు. ముఖ్యంగా టూరిస్ట్ ప్రదేశాల్లో రుచులు కూడా విభిన్నంగా ఉంటాయి. మహారాష్ట్ర, కర్ణాటక, మరియు గోవా ఇలా ఒక్కో ప్రదేశానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. కొంకన్ సాంబార్ రిసిపి కొన్ని రాష్ట్రాల మిశ్రమ వంటకం. ముఖ్యంగా నార్త్. గోవా, మహారాష్ట్ర, మరియు కర్ణాటకాలల్లో ఎక్కువగా వండుతారు.

బెండీకా సాలన్: డెలిషియస్ వెజిటేరియన్ రిసిపి

బెండీకా సాలన్: డెలిషియస్ వెజిటేరియన్ రిసిపి


బెండీ లేదా బెండకా వర్సిటైల్ వెజిటేబుల్. ఎందుకంటే వివిధ రకాల పదార్థాలతో ఈ బెండకాయను మనం వండుకోవచ్చు . కొన్ని ఫ్లేవర్ కలిగిన పదార్థాలను ఉపయోగించి చేస్తే, చాలా టేస్ట్ గా ఉంటుంది. బెండకాయను రుచికరంగా వండితే, పుల్కా లేదా రోటిలకు చాలా అద్భుత రుచి కలిగి ఉంటుంది.

వింటర్ స్పెషల్ మీల్ మేకర్ దాల్చా

వింటర్ స్పెషల్ మీల్ మేకర్ దాల్చా


దాల్చా ఫర్ ఫెక్ట్ హైదరాబాదీ డిష్. సౌంత్ ఇండియన్స్ ఈ దాల్చా అంటే ఇష్టపడుతారు. అయితే దాల్చా కందిపప్పు , పచ్చి శెనగ పప్పుతో వెజిటేబుల్స్ లేదా మటన్ మిక్స్ చేసి తయారు చేస్తారు. ఈ వింటర్ స్పెషల్లో తయారు చేసే దాల్చా చాలా రుచిగా .. ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

మేతిఆలూ-పరోటా,రోటికి బెస్ట్ కాంబినేషన్

మేతిఆలూ-పరోటా,రోటికి బెస్ట్ కాంబినేషన్


మన ఇండియంన్ కుషన్స్ లో తాజా మెంతికూర, బేబీ పొటాటోలను ఉపయోగించి మేతి ఆలూ తయారుచేయడం చాలా సులభం మరియు సింపుల్ ప్రిపరేషన్ . బేబీ పొటాటాలో అందుబాటులో లేకపోతే సాధారణ బంగాళదుంపలను ఉపయోగించవచ్చు. ఇది అధిక న్యూట్రీషిన్ ఫుడ్ మరియు హాట్ పరోటా మరియు రోటీలతో ఎంజాయ్ చేయవచ్చు...

మిర్చి కా సాలన్: హైద్రాబాదీ గ్రీన్ చిల్లీ కర్రీ

మిర్చి కా సాలన్: హైద్రాబాదీ గ్రీన్ చిల్లీ కర్రీ


మిర్చికా సాలన్ వందశాతం వేజిటేరియన్ రిసిపినే అంతే కాదండోయ్..వందశాతం కారం కూడా.... కాబట్టి మీరు కారం తినాలని ఇష్టపడుతుంటే మిర్చికా సాలన్ టేస్ట్ చేయవచ్చు. దీనికి కోకోనట్ గ్రేవీ మంచి రుచిని అందిస్తుంది. మిర్చికా సాలన్ హైద్రాబాద్ వంటకాల్లో ఒక మార్క్ ఉంది.

బెంగాలీ స్టైల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ

బెంగాలీ స్టైల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ


గ్రీన్ వెజిటేబుల్స్ పుష్కలంగా దొరికే సీజన్ వింటర్. మార్కెట్లో, చిన్న చిన్నకూరగాయల అంగడిలో మొత్తం గ్రీన్ గ్రీన్ గా వెజిటేబుల్స్ కనబడుతుంటాయి. కాబట్టి, సీజనల్ గా దొరికే వివిధ రకాల కూరగాయాలను మర రెగ్యులర్ డైట్ లో పూర్తిగా చేర్చుకోవాలి. అప్పుడే మన శరీరానికి చేరాల్సి పోషకాశాలన్నీ అందుతాయి. ఒక్కో రకమైన కూరగాలతో వంట వండటం ఒక రుచి అయితే, మూడు, నాలుగు రకాల తాజా కూరగాయలు, వాటికి కొద్దిగా కూరాకు కూడా మిక్స్ చేస్తే చాలా అద్భుతమై రుచి ఉంటుంది.

ముడి పెసళ్ళు మొలకల సలాడ్: హెల్తీ బ్రేక్ ఫాస్ట్

ముడి పెసళ్ళు మొలకల సలాడ్: హెల్తీ బ్రేక్ ఫాస్ట్


మొలకలు మన ఆరోగ్యానికి అనేక ఆరోగ్యప్రయోజనాలను అంధిస్తాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరియు బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక గ్రేట్ హోం రెమెడీ. కాబట్టి, ఈ రోజు మీకోసం ఒక ఫర్ ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి. ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపి వల్ల మీరు బరువు తగ్గడంతో పాటు మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు.

కాకరకాయ సుఖ రిసిపి: టేస్టీ అండ్ టేస్టీ

కాకరకాయ సుఖ రిసిపి: టేస్టీ అండ్ టేస్టీ


కాకరకాయ అంటేనే ఇది చాలా చేదుగా ఉంటుందని అనుకోకూడదు. చేదు లేకుండా కూడా, తయారుచేవచ్చు. కొంచెం ఓపిగ్గా తయారుచేస్తే చాలా రుచిగా ఉంటుంది. అందుకు సరైన పదార్థాలు మరియు టెక్నిక్స్ ను అనుసరిసరిస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది . చాలా వరకూ రెగ్యులర్ వెజిటేబుల్స్ కంటే బిట్టర్ గార్డ్ (కాకరకాయ) చాలా రుచికరంగా ఉంటుంది.

డెలిషియస్ వెజిటేబుల్ దాల్ రిసిసి

డెలిషియస్ వెజిటేబుల్ దాల్ రిసిసి


పప్పు లేకుండా ఇండియన్ మీల్స్ పూర్తి కాదు. చపాతీలోకి ఫర్ ఫెక్ట్ గా కాంబినేషన్ వంటలు చాలా ఉండకపోవచ్చు. కానీ, ఒక కప్పు పప్పు ఉంటే చాలా ఏ కంప్లైయిట్స్ లేకుండా హ్యాపీ తినేయవచ్చు . ఇంకా పప్పులతో తయారుచేసే వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. రుచి మాత్రమే కాదు పూర్తి పోషకాలతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటారు.

వెజిటేబుల్ కడీ-రైస్&రోటీ కాంబినేషన్

వెజిటేబుల్ కడీ-రైస్&రోటీ కాంబినేషన్


కడీ, పాపులర్ ఇండియన్ డిష్. దీన్ని శెనగపిండి మరియు పుల్లని పెరుగుతో తయారుచేస్తారు. ఈ వంటలో వివిధ రకాలున్నాయి. అయితే, ఈ రోజు తయారుచేస్తున్న కడీ రిసిపికి కొన్ని రకాల వెజిటేబుల్స్ ను మిక్స్ చేసి మరింత ఆరోగ్యకరంగా మరియు రుచికరంగా తయారుచేయవచ్చు.

కడైదాల్ తడ్కా: స్పెషల్ ఇండియన్ రిసిపి

కడైదాల్ తడ్కా: స్పెషల్ ఇండియన్ రిసిపి


దాల్ తడ్కా ఒక ఫేమస్ డిష్. ఈ దాల్ తడ్కాను ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ దాల్ తడ్కా రిసిపి హాట్ తందూరి రోటీలకు ఫర్ఫఎక్ట్ కాంబినేషన్ . ఈ దాల్ తడ్కా రిసిపి రెస్టారెంట్ టాప్ ఫుడ్స్ లో ఒది ఒక ఆథెంటిక్ రిసిపి. ఈ రిసిపిని సాధారణంగా కందిపప్పుతో తయారుచేస్తారు. ఈ రిసిపి కాస్తా కారంగా మరియు టేస్టీగా ఉండేటటువంటి ఇండియన్ కుషన్ రిసిపి.

English summary

హెల్తీ అండ్ టేస్టీ వెజిటేరియన్ వంటలు

This excellent collection of the best vegetarian recipes is sure tickle your taste-buds and tempt you to turn vegetarian. The varieties of vegetarian items like paneer, tofu, soyabean and various vegetables prepared with the blend of various fragrant spices is sure to take your senses on a delightful ride.
Desktop Bottom Promotion