For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దాల్ మఖానీ తయారు చేడం ఎలా?

|

దాల్ మఖానీ పంజాబీ స్పెషల్ డిష్ చాలా వెరైటీగా టేస్టీగా ఉంటుంది. దాల్ మఖానీ వివిధ చిరుధాన్యాలతో తయారు చేస్తారు. పంజాబీయులకు చాలా ఇష్టమైన వెజిటేరియన్ వంటకం. దీన్ని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.

దాల్ మఖాని వేడి వేడి పుల్కాలు, రోటీలకు చక్కటి కాంబినేషన్. ఇందులో వేసి చిరుధాన్యాలు, రాజ్మావల్ల మరింత స్పెషల్ టేస్ట్ వస్తుంది. మరి దాల్ మఖానీ ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:

పొట్టు మినప్పప్పు: 50grms
శనగపప్పు: 20grms
రాజ్మా: 30grms
కారం: తగినంత
బిరియానీ ఆకు: 3
నువ్వుపప్పు: 3tsp
నెయ్యి: కొద్దిగా
నూనె: తగినంత
జీరాపౌడర్: 1/2tsp
లవంగాలు: 2
దాల్చినచెక్క: చిన్నముక్క
ఉల్లితరుగు: 1/2cup
వెల్లుల్లి: రెండు రెబ్బలు
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tsp
టొమాటో ప్యూరీ: 1/2cup
ఎండుమిర్చి: 3
మెంతిపొడి: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
పాలు: 3tsp
బటర్: కొద్దిగా
క్రీమ్: కొద్దిగా
అల్లం తురుము: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా మూడురకాల పప్పులను సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి.
2. తరవాత నీరు ఒంపేసి వాటికి కారం, బిరియానీ ఆకు, నువ్వుపప్పు కలిపి ఉడికించాలి.
3. తర్వాత ఒక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కరిగించి, దానిని పై మిశ్రమానికి కలిపి పక్కనుంచుకోవాలి.
4. అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి జీరాపౌడర్, లవంగాలు, దాల్చినచెక్కలను వేసి దోరగా వేయించాలి.
5. ఆ తరువాత అందులో ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉడికిన తరవాత టొమాటో ప్యూరీ వేసి కలుపుతూ ఉడికించాలి.
6. తరువాత ఎండుమిర్చి, మెంతిపొడి, ఉప్పు వేసి కలిపి అందులో ఉడికించుకున్న పప్పును వేసి కలుపుతూ కొద్దిగా పాలు పోయాలి.
7. తరువాత అందులో బటర్, క్రీమ్ పైన వేయాలి. దానిమీద అల్లం తరుగు వేసి వేడి వేడి రోటీలతో, పుల్కాలలో సర్వ్ చేయాలి.

English summary

How to make delicious Dal Makhani | రోటీ-పుల్కా స్పెషల్ దాల్ మఖానీ!

You can make this Famous North Indian dish at your home. Here is Dal makhani.
Desktop Bottom Promotion