For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పులిహోర(పులియోగ్రే ) :ట్యాంగీ అండ్ స్వీట్..

|

సాదారణంగా మనం పులిహోరలను రకరకాలుగా చేసుకొంటాము. సౌత్ ఇండియన్ వంటకాల్లో ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో పులిహోర కూడా ఉంటుంది. అయితే టామరిండ్ పులిహోర కూడా ఒక మంచి అల్పాహారం. ఇది పుల్లపుల్లగా.. కారం కారంగా..తియ్య తియ్యగా నోరూరిస్తుంటుంది.

ఇందులో కొన్ని సువాసనలిచ్చే పదార్థాలను చేర్చడం వల్ల రుచితో పాటు సువాసన కూడా బాగుంటుంది. చింతపండును ఉపయోగించడం వల్ల అందులో ఎక్కువగా మినరల్స్ , విటమిన్స్, జీర్ణశక్తికి ఉపయోగపడే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో చాలా విటమిన్లు ఉంటయి. థైమన్, విటమిన్ ఎ, ఫోలిక్ ఆసిడ్, రిబోఫ్లివిన్, నయసిన్, విటమిన్ సి కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతాయి. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గానేకాదు, లంచ్ బాక్స్ గాపట్టుకెళ్లవచ్చు.

How to make Puliyogare:South Indian Special


బాస్మతి రైస్- 1 cup
పసుపు- 1tsp
బెల్లం- 2tbsp (తురుము)
ఉప్పు-రుచికి సరిపడా
వేరుశెనగపప్పు- 2tbsp
నీళ్ళు- 3 cups

చింతపండు పేస్ట్ కోసం
చింతపండు గుజ్జు- 2tbsp
మెంతులు- ½ tsp
ధనియాలు- 1tbsp
ఎండుమిర్చి- 3
ఉప్పు- చిటికెడు

మసాలా కోసం:
కొబ్బరి తురుము- ½ cup
తెల్ల నువ్వులు- 1tbsp

పోపుకోసం:
నువ్వుల నూనె- 1tbsp
ఆవాలు- 1tsp
ఇంగువ- చిటికెడు
ఎండుమిర్చి- 2
ఉద్దిపప్పు- 1tsp
శెనగపప్పు- 1tsp
కరివేపాకు- 6-7

తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యంలో నీళ్ళు పోసి శుభ్రంగా కడగాలి.
2. తర్వాత బియ్యంలో సరిపడా నీళ్ళు పోసి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక కప్పులో కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా మెంతులు, ధనియాలు, మరియు ఎండు మిర్చి వేసి కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి కొబ్బరి తురుము వేసి 5నిముషాలు తక్కువ మంటలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో నువ్వులు కూడా వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.ఈ మొత్తం మిశ్రమం చల్లారనివ్వాలి.
5. చల్లారిన కొబ్బరి తురుము, నువ్వులు మిక్సీలో వేసి రఫ్ గా పొడి చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి.
6. ఇప్పుడు మెంతుల మిశ్రమంలోని నీరు వంపేసి, మిక్సిలో వేసి, వీటితో పాటు చింత పండు గుజ్జు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
7.తర్వాత పాన్ లో కొద్దిగా నువ్వుల నూనె వేసి ఒక నిముషం వేడి అయ్యాక, అందులో పోపుదినుసులు వేసి ఒక్క నిముషం ఫ్రై చేసుకోవాలి.
8. పోపు వేగిన తర్వాత అందులో బెల్లం తురుము, చింతపండు గుజ్జు మిశ్రమాన్ని వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
9. తర్వాత అందులోనే ఉప్పు, పసుపు, అన్నం వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ 2 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
10. తర్వాత మంట తగ్గించి, ముందుగా వేగించి పెట్టుకొన్న వేరుశెనగపప్పును గార్నిష్ గా చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే పులిహోర(పులియోగ్రే ) రెడీ.

English summary

How to make Puliyogare:South Indian Special

Puliyogare is a very famous vegetarian recipe from South India. Its is not only relished as a main dish, but is also served as 'prasad' in the South-Indian temples. Puliyogare is nothing but tamarind flavoured rice cooked up with some tasty and fragrant spices which makes this recipe an absolute delight for all.
Story first published: Tuesday, October 27, 2015, 13:18 [IST]
Desktop Bottom Promotion