For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాదీ ఆలూ కా దమ్ బిర్యానీ

|

బిర్యానీ అంటే మొదట గుర్గు వచ్చేది మన ఇండియాలో హైదరాబాదే. మన భారతదేశంలోనే బిర్యానీ తినాలంటే మాత్రం హైదరాబాదా రావాల్సిందే...బిర్యానీ, మైదరాబాద్ ఒకే సంస్కృతికి రెండు పేర్లు. మిర్చీకా సాలన్, పెరుగు పచ్చడి, మీటా పాన్, డబుల్ కా మీఠా.. ఇవన్నీ బిర్యానీకి అదనపు రుచులు అందిస్తాయి. అంతే కాదు, రాజులు, మహారాజులు, సామాన్యులు -...ఇలా ఎవరైనా సరే హైదరాబాద్ బిర్యానీకి తలవంచి సలామ్ చెయ్యాల్సిందే. మరి బిర్యానీ ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా స్పెషల్ గా తయారు చేసుకుంటే ఆ మజాయే వేరు.

ఘుమఘుమలాడే హైదరాబాదీ చికెన్ బిర్యానీ

సాధారణంగా మనం వివిధ రకాలుగా బిర్యానినీ తయారుచేసుకుంటాం, మరింత స్పెషల్ గా దమ్ కా బిర్యానీ తయారుచేసుకుంటే ఎలా ఉంటుంది. దమ్ బిర్యానినే కానీ, ఆలూ దమ్ బిర్యానీ. చాలా సింపుల్ గా అతి తక్కువ మసాలా దినుసులతో తయారుచేసే ఈ ఆలూ దమ్ కా బిర్యానీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Hyderabadi Aloo Dum Ka Biryani


కావల్సిన వస్తువులు:
ఆలూ: 6

బిర్యాని రైస్ తయారు చేయడానికి కావల్సినవి:
బియ్యం: 2cups
చికెన్ స్టాక్: 3cups(చికెన్ ఉడికించి తీసుకొన్న నీరులేదా సూప్)
లవంగాలు: 4
చెక్క: చిన్న ముక్క
బ్లాక్ కార్డమం: 3
బ్లాక్ పెప్పర్: 4-6
బిర్యాని ఆకు: 1
నిమ్మరసం: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా

కచ్చ గోష్ట్ బిర్యానీ : హైదరాబాదీ స్పెషల్
నెయ్యి లేదా నూనె: 1tbsp
మసాలా కొరకు:
నెయ్యి: 4tbsp
ఉల్లిపాయ: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 3tsp
టమోటో: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
తాజా కొత్తిమీ తరుగు: 1/4cup
కారం: 1tsp పసుపు: 1/4tsp
గరం మసాలా: 1tsp
పెరగు: 1/2cup
నిమ్మరసం: 2tbsp

గార్నిషింగ్ కోసం-లేయరింగ్
ఉల్లిపాయ: 1(కొంచెం మందంగా తరిగిపెట్టుకోవాలి)
నెయ్యి: 2tbsp
జీడిపప్పు: 1/4cup
కుంకుమపువ్వు: చిటికెడు
పాలు: 2tbsp

ఎగ్ దమ్ బిర్యానీ రిసిపి: అద్భుత టేస్ట్

తయారు చేయు విధానం:
1. ముందుగా ఆలూ ఉడికించి పొట్టుతీసి పక్కన పెట్టుకోవాలి. (మీకు ఇష్టమైతన ఉడికించిన ఆలూను రెండు బాగాలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు)
2. గార్నిషింగ్: స్టౌ మీద పాన్ పెట్టిఅందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే జీడిపప్పు మరియు ద్రాక్ష కూడా వేసి వేగించుకోవాలి.
4. తర్వాత ఒక కప్పు వేడి పాల్లో చిటికెడు కుంకుమపువ్వు వేసి వేడి పక్కన పెట్టుకోవాలి.
5. మసాల కోసం: మందపాటి గిన్నెలో నెయ్యివేసి, వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా వేగించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు మూడు నిముషాల వేగించుకోవాలి.
6.మసాలకోసం సిద్దంగా పెట్టుకొన్న అన్ని వస్తువులను వేసి 5నిముషాల పాటు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
7. తర్వాత అందులోనే ఉడికించిన ఆలూ కూడా వేసి రెండు నిముషాల వేగించాలి.
8. అన్నం: బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

బాంబే చికెన్ బిర్యానీ : నాన్ వెజ్ స్పెషల్
9. ఇప్పుడు మరో పాన్ ను స్టౌ మీద పెట్టి నెయ్యి వేసి అన్నం కోసం సిద్దం చేసుకొన్న మాసాలాలన్నింటిని అందులో వేసి వేగించి అందులోనే నీరు వంపేసి బియ్యాన్ని కూడా వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
10. తర్వాత అందులోనే సరిపడా నీళ్ళు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 90%అన్నం ఉడికేంత వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
11. లేయరింగ్: ఇప్పుడు మంద పాటి పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో ఆలూ మసాలాను మొదటి లేయర్ గా పరవాలి. తర్వాత దీని మీద అన్నంను పరవాలి.అన్నం మీదు నెయ్యిలో వేయించుకొన్న ఉల్లిపాయ, జీడిపప్పు,ద్రాక్షను పరవాలి. ఇలా రెండు మూడు లేయర్లుగా ఒకదాని తర్వాత ఒకటి పరుచుకోవాలి.
12. చివరి లేయర్ మీద కుంకుమ పువ్వు నానబెట్టుకొన్న పాలను చిలకరించాలి. తర్వాత దీని మీద అల్యూమినియం సీట్ పరచి మూత పెట్టి తక్కువ మంట మీద 10-15నిముషాలు ఉడికించుకోవాలి. అంతే హైదరాబాది ఆలూ దమ్ బిర్యాని రెడీ. మీకు ఇష్టైన రైతా తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.

English summary

Hyderabadi Aloo Dum Ka Biryani

If you are looking for a simple aloo biryani, here are some of the posts on veg biryani recipes which you can easily adapt to make a simple biryani.
Story first published: Saturday, January 30, 2016, 17:05 [IST]
Desktop Bottom Promotion