For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ స్పెషల్ పెరుగు - బెండకాయ మసాలా కర్రీ

By Super Admin
|

హైదరాబాద్ గురించి మాట్లాడగానే చార్మినార్ లేదా హైదరాబాదీ బిర్యానీ లేదా హైదరాబాదీ ముత్యాలు మాత్రమే కాదు, నవాబ్ స్టైల్ కుషన్స్ కూడా అనేక మంది గుండెల్ని కొల్లగొట్టేసాయి.

నవాబ్ కుషన్స్ లో హైదరాబాది బిర్యానీ ఎలా మర్చిపోతాం? వేరే రాష్ట్రాలు, వేరే నగారాల్లో కూడా బిర్యానీ తయారుచేస్తారు. తింటారు. హైదరాబాది బిర్యానీ టేస్టే వేరు. ఇదే ఒరిజినల్ టేస్ట్ . హైదరాబాద్ లో తయారుచేసే బిర్యానీతో వేరే ఎక్కడ చేసిన బిర్యానీ మ్యాచ్ అవ్వదు..

బిర్యానీ బిర్యానీ..శాఖాహారాలు కోప్పడకండి. హైదరాబాది కుషన్స్ లో మాంసాహారాలు మాత్రమే కాదు, అద్భుతమైన హైదరాబాది శాఖాహారాలు కూడా ఉన్నాయి. హైదరాబాది కుషన్స్ లో ఫేమస్ దహీ బేండీ మసాల కర్రీ గురించి మీరెప్పుడైనా విన్నారా?

లేదు అంటే , మీకోసం ఒక మంచి స్పెషల్ బెండీ రిసిపిని పరిచయం చేస్తున్నాము. మరి ఈ వంటకు కావల్సిన పదార్థాలేంటి, దీన్ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం

vegetarian recipes

కావల్సిన పదార్థాలు :

1. బెండకాయ - ½ కిలో (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)

2. ఉల్లిపాయలు - 2 (పెద్దవి సన్నగా తరిగి పెట్టుకోవాలి)

3.నూనె - 1½ tbsp

4. టమోటోలు - 2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

5. అల్లం - ½ tsp (సన్నగా తరగాలి)

6. వెల్లుల్లి పేస్ట్ - ½ tsp

7. ఉద్దిపప్పు - 1 tsp

8. కారం - 1 tsp

9. ఆవాలు - ½ tsp

10. పసుపు - ½ tsp

11. కొబ్బరి తురుము - 1½ tsp

12.గరం మసాలా - 1 tsp

13. కరివేపాకు - 4-5

14. డ్రై మ్యాంగో పౌడర్ - ½ tsp

15. జీడిపప్పు - 10 (పాలలో నానబెట్టుకోవాలి)

16. కుంకుమపువ్వు - ½ tbsp (పొడి చేసుకోవాలి)

17.ధనియాల పొడి - 1½ tsp

18. పెరుగు - 1 cup

19. ఉప్పు రుచికి సరిపడా

20. వాటర్ - 2 cups

21. ఇంగువ - చిటికెడు

22. జీలకర్ర - ½ tsp

తయారుచేయు విధానం:

1. ముందుగా పాలలో నానబెట్టిన జీడపప్పు, కొబ్బరి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.

2.బెండకాయలను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.

3. పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత బెండకాయ ముక్కలు వేసి పొడిగా ప్రై చేసుకోవాలి. వీటిని ఒక పేపర్ టవల్ మీద వేయాలి. ఇలా వేయడం వల్ల ఎక్సెస్ ఆయల్ పీల్చుకుంటుంది.

4. అదే పాన్ లో మరికొద్ది నూనె వేసి వేడి అయ్యాక, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉద్దిపప్పు, కరివేపాకు, వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

5.తర్వాత అందులోనే ఉల్లిపాయలు, అల్ల వేసి సాప్ట్ అయ్యే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో రెడ్ చిల్లీ పౌడర్ , పసుపు, ధనియాల పొడి, , కస్తూరి మేతి, మామిడికాయ పొడి , వెల్లుల్లి పేస్ట్ మరియు గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి.

6. ఆ తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ వేపుకోవాలి. టమోటో మెత్తబడ్డాక అందులో జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ , పెరుగు వేసి మిక్స్ చేయాలి..

7. తర్వాత బెండకాయ ముక్కలను కూడా వేసి మిక్స్ చేసి వేగించుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి కొద్ది నిముషాలు ఉడికించుకోవాలి.

8. కర్రీ చిక్కగా మారితే అందులో కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు సరిచూసుకోవాలి. అంతే దహీ హైదరాబాదీ బేండి మసాల కర్రీ రిసిపి రెడీజ వేడి వేడిగా సర్వ్ చేయండి.

English summary

Hyderabadi Special: Curd And Bhindi Masala Curry

Whenever you are talking about the state of 'Hyderabad', you not only talk about the 'Char Minar' or the 'Hyderabad Pearls' but also about the 'Nawabi' style cuisine that has won several hearts.
Desktop Bottom Promotion