For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గార్లిక్ నూడిల్స్ విత్ టమోటో సాస్

|

నూడిల్స్ ఒక పాపులర్ చైనీస్ డిష్ . ఈ నూడిల్స్ ను ప్రపంచ వ్యాప్తంగా తయారుచేసుకుంటున్నారు. ఈ బేసిక్ చైనీస్ రిసిపిని మన లోకల్ టేస్ట్ కు సరిపోయే విధంగా ఆయా ప్రాంతలకు టేస్ట్ కు సరిపోయే విధంగా తయారుచేసుకుంటున్నారు. ఉదా: నూడిల్స్ ను కొన్ని మసాలా దినుసులను ఉపయోగించి తయారుచేసుకుంటారు.

ఇంకా మన ఇండియన్ కుషన్స్ లో మీరు వెరైటీ చైనీస్ నూడిల్స్ ను తయారుచేసుకోవచ్చు. అందుకు మన ఇండియన్ మసాలా దినుసులు అద్భుతంగా సహాయపడుతాయి. మీరు వీకెండ్ స్పెషల్ గా కొత్త రుచిని టేస్ట్ చేయాలంటే ఈ చైనీస్ నూడిల్స్ ను ప్రయత్నించవచ్చు. ఈ సింపుల్ నూడిల్స్ రిసిపిని మీరు చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు. ఇండియన్ స్టైల్ గార్లిక్ నూడిల్స్ ను స్నాక్ గాను లేదా మీల్స్ లేదా లైట్ డిన్నర్ గా ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. అయితే ఈ నూడిల్స్ బ్రేక్ ఫాస్ట్ కు చాలా తేలికగా ఉంటుంది.

Indian Style Garlic Noodles

కావల్సిన పదార్థాలు:
నూడుల్స్-1 మీడియం సైజ్ ప్యాకెట్
వెల్లుల్లి: 10-15 పాడ్లు (చూర్ణం)
పచ్చిమిర్చి: 3-4 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2 (సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యారెట్ 1 (సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
సోయ్ సాస్: 1tsp
ఎండుమిర్చి : 2లేదా 3 (పొడి చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tsp

తయారుచేయు విధానం:
1. డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు న్యూడిల్స్ వేసి, ఒక టీస్పూన్ నూనెను చిలకరించాలి. తర్వాత కొద్దిగా ఉప్పును కూడా వేయాలి.
2. నూడిల్ కొంచెం మొత్తగా ఉడకనివ్వాలి. నూనె మరియు ఉప్పు చేర్చడం వల్ల నూడిల్స్ ఒకదానితో ఒకటి అంటుకోకుండా ఉంటాయి.
3. నూడిల్స్ 90% ఉడికిన తర్వాత, స్టౌ ఆఫ్ చేసి, నూడిల్స్ నుండి నీరును వంపేయాలి తర్వాత అందులో చల్లని నీళ్ళు పోసి, తిరిగి వంపేసి, సూయింగ్ ఫోర్క్ తో నూడిల్స్ ను విడదీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ ను స్టౌ మీద పెట్టి, నూనె వేసి కాగిన తరవ్ాత అందులో రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి.
5. తర్వాత అందులో ఉల్లిపాయలు, మరియు వెల్లుల్లి ముక్కలు వేసి మీడియం మంట మీద 2నిముషాలు వేయించుకోవాలి.
6. ఇప్పుడు అందులో క్యారెట్ మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి.
7. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు చిలకరించి, ఉల్లిపాయలు కొంచెం మెత్తగా వేగిన తర్వాత అందులో సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేయాలి.
8. ఇప్పుడు అందులో నూడిల్స్ వేసి బాగా మిక్స్ చేయాలి, మొత్తం మిశ్రమం బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అంతే ఇండియన్ స్టైల్ గార్లిక్ నూడిల్స్ రెడీ. అంతే ఈ హాట్ నూడిల్స్ ను టమోటో సాస్ మరియు మంచూరియన్ తో సర్వ్ చేయండి.

English summary

Indian Style Garlic Noodles


 Noodles is one of the most popular Chinese dishes which is prepared worldwide. The basic Chinese recipe has been modified as per local tastes. For example, the noodles is prepared using some authentic spices like garlic and red chillies in many cuisines.
Story first published: Saturday, March 1, 2014, 11:52 [IST]
Desktop Bottom Promotion