For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ స్టాంట్ వెజిటేబుల్ బాత్....

|

Vegetable Bath
రొటీన్ కి భిన్నంగా వంటలు చేయడం అంటే కలర్ ఫుల్ గా, టేస్టీగా, చూస్తానే నోరూరించే విధంగా వండాలి. అలా కలర్ ఫుల్ గా కనిపించే వాటిలో క్యారెట్, టమోట్, క్యాప్సికం ముందుంటాయి..వీటితో ఏ వంటచేసిన ఆహా ఏమి రుచి అనిపించేస్తాయి..పిల్లలైతే మరీ ఇష్టంగా తినేస్తారు....మరైతే ఈరోజు ఆ కలర్ ఫుల్ వంట రుచి చూసేద్దామా....

కావలసిన పదార్థాలు:
క్యారెట్: 1cup(చిన్నగా రౌండ్ గా కట్ చేసినవి)
పచ్చిబఠాని: 1cup
క్యాప్పికమ్: 1cup(పొడగ్గా,సన్నాగ తరిగినవి)
పొటాటో: 1cup(చిన్నగా రౌండ్ గా కట్ చేసినవి)
టమోటో: 1cup(చిన్నగా కట్ చేసుకోవాలి)
ఉడికించిన అన్నం: 2-3cup
ఉప్పు: రుచిరికి సరిపడా
నూనె: 2-3 స్పూన్

మసాలా కొరకు:
దోరగా వేయించిన పెసరపప్పు: 1cup
ఎండుమిర్చి: 4
ఇంగువ: చిటికెడు
ఎండు కొబ్బరి తురుము: కొద్దిగా

తయారు చేయు విధానము:
1. మొదటగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడియ్యాక అందులో వేసి బాగా వేయించి తక్కువ మంటతో బాయిల్ చేయాలి
2. వెంజిటేబుల్స్ అన్ని కొద్దిగా దోరగా వేగగానే, కలర్ కూడా మారుతుంది, అప్పుడు వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మసాలా కొరకు సిద్దం చేసుకొన్న వాటిని మిక్సిలో వేసి గ్రైండ్ చేసి పౌడర్ తయారు చేసుకోవాలి.
4. తర్వాత ఈ పౌడర్ ను ముందుగా వండి పెట్టుకొన్ని అన్నంకు కలపాలి. అందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు, ఉడికించి పెట్టుకొన్న కూరగాయలు వేసి బాగా మిక్స్ చేయాలి.
5. అంతే వెజిటేబుల్ బాత్ రెడి. వడ్డించే ముందు కొద్దిగా నిమ్మరం వేసి బాగా కలగలిపి సర్వ్ చేయాలి. అంతే టేస్టీ ఇన్ స్టాంట్ మసాల రైస్ రెడీ..దీనిని రైతా తో తింటే మరింత రుచిగా ఉంటుంది.

English summary

Instant Vegetable Bath | ఇన్ స్టాంట్ వెజిటేబుల్ బాత్....

It is always best to make food colorful and attractive. Colors play a vital role in increasing or decreasing the appetite of a person. Lovely carrots and rich tomatoes can water the mouth of kids and will make them eat in minutes.
Story first published:Wednesday, September 7, 2011, 15:15 [IST]
Desktop Bottom Promotion