For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమోటో మేతి పులావ్ రిసిపి

|

చాలా మంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. కానీ, ఇండియన్ మహిళల్లో 50శాతం మంది అనీమియాతో బాధపడుతున్నారు. అనీమియా ఐరన్ లోపం వల్లే ఈ సమస్య ఉంటుంది. అందువల్ల, ఈ సమస్యతో బాధపడేవారికి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా హెల్తీ ఫుడ్స్ రెడ్ మీట్, గ్రీన్ వెజిటేబుల్స్, లెగ్యుమ్స్ మరియు హెర్బ్స్ వంటి వాటి ఎక్కువగా రెగ్యులర్ గా తీసుకోవాలి.

Iron Rich Tomato Methi Pulao Recipe

మెంతి ఆకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మెంతులను మరియు మెంతి ఆకులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే ఔషధగుణాల వల్ల అనీమియా సమస్యను నివారించుకోవచ్చు.ఎవరైతే హీమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్నారో, వారికి మెంతులు మరియు ఆకుకూరగను రెగ్యులర్ డైట్ లో ఏదోఒకవిధంగా చేర్చుకోవాలి.
అలాంటి వంటల్లో ఒకటి న్యూట్రీషియన్ ఫుడ్ టమోటో మేతి పులావ్ ఒకటి. అంతే కాదు, బ్రౌన్ రైస్, టమోటో, మెంతులు ఉపయోగించి ఈ వంటను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

Iron Rich Tomato Methi Pulao Recipe

కావల్సిన పదార్థాలు:
టమోటోలు: 3 (chopped)
మేతి(మెంతి ఆకులు): 3 cups (chopped)
ఎర్రబియ్యంతో వండిన అన్నం: 3 cups (cooked)
ఉల్లిపాయ పేస్ట్: 1/4 cup
వెల్లుల్లి పేస్ట్: 2tsp
పచ్చిమిర్చి పేస్ట్: 2 (slit)
పసుపు: 1tsp
కారం: 1tsp
జీలకర్ర: 1tsp
ధనియాలపొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1tsp
బిర్యానీ ఆకు: 1
దాల్చిన చెక్క: 1 stick
లవంగాలు: 2-3
యాలకలు: 2
నూనె: 2tbsp

Iron Rich Tomato Methi Pulao Recipe

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకలు, లవంగాలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
2. పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లిపేస్ట్ వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో టమోటోలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిక్స్ చేస్తూ మీడియం మంట మీద మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో మెంతిఆకు కూడా వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

Iron Rich Tomato Methi Pulao Recipe

5. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. మెంతి ఆకు మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు అందులో ముందుగా వండి పెట్టుకొన్న బ్రౌన్ రైస్ వేసి నిధానంగా మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రం కలగలిసేలా ఉండి, తర్వాత స్టౌ ఆఫ్ చేసి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. హెల్తీ అండ్ టేస్టీ ఐరన్ రిచ్, టమోటో మేతి పులావ్ రిసిపి రెడీ. ఈ హెల్తీ మీల్ ను పెరుగు మరియు మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేయవచ్చు.

Iron Rich Tomato Methi Pulao Recipe

English summary

Iron Rich Tomato Methi Pulao Recipe

Women in general are slight deficient in iron. But when it comes Indian women, almost 50 percent of them are anaemic. Anaemia is a form of iron deficiency that is actually an epidemic among Indian women. That is why, iron rich recipes are very essential for women. Iron rich recipes specifically include healthy foods for women like red meat, green vegetables, legumes and herbs.
Story first published: Monday, January 19, 2015, 13:50 [IST]
Desktop Bottom Promotion