For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాశ్మీర్ రాజ్మా మసాలా రిసిపి

|

కాశ్మిర్ రాజ్మా మసాలా. మంచి రుచికరమైన రిసిపి. రాజ్మాలో రెండు రకాలు మనకు మార్కెట్లో లభ్యం అవుతాయి. ఒకటి తెల్లగా ఉండే రాజ్మా(కిడ్నీ బీన్స్)పంజాబ్ లో ఎక్కువగా పండిస్తారు. ఇక రెండవది రెడ్ రాజ్మా వీటిని కాశ్మిర్ లో ఎక్కువగా పండిస్తారు. అందుకే ఈ రెడ్ రాజ్మాను కాశ్మిర్ రాజ్మా మసాలా తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

రాజ్మా వంటకం స్పైసీ కాదు. అయితే పంజాబీ వెరైటీ వంటకం. చాలా వరకూ కాస్మిర్ వంటలు కొంచెం స్పైసీగానే ఉంటాయి. ఈ రాజ్మా రిసిపిలో చాలా వరకూ ఎక్కువగా మసాలా దినుసులు ఉపయోగించి మన టేస్ట్ కు తగ్గట్టు తయారు చేయబడింది. ఈ కాశ్మిర్ రాజ్మాను ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉపయోగించకుండానే తయారు చేయడం వల్ల ఇది వెరైటీ టేస్ట్ మరియు ఫ్లేవర్ కలిగి ఉంటుంది. మరి కాశ్మిర్ రాజ్మా మసాలాను ఎలా తయారు చేయాలో చూద్దాం...

Kashmiri Rajma Masala Recipe

కాశ్మీర్ రాజ్మా: 2cups(రాజ్మా(కిడ్నీబీన్స్ )ను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి)
బిర్యాని ఆకు: 1
జీలకర్ర: 1tsp
ఇంగువ: 1 చిటికెడు
టమోటోలు: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం: చిన్న ముక్క(తాజాది, తరుముకోవాలి)
ధనియాల పొడి: 1tsp
కాశ్మిరి రెడ్ చిల్లీ పౌడర్: 1/2 tsp
కొత్తిమీర: 2 stalks(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
మస్టర్డ్ ఆయిల్: 2tbsp
గరం మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా రాత్రంతా నానబెట్టి పెట్టుకొన్ని రాజ్మాను శుభ్రంగా కడి కుక్కర్ లో వేసి, 2-3కప్పుల నీటిని పోసి మూత పెట్టి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఐదు నిముషాల తర్వాత మూత తీసి నీరు వేరే గిన్నెలోనికి వంపేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వత డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి వేడయ్యాక, అందులో బిర్యాని ఆకు, ఇంగువ, మరియు జీలకర్ర వేసి వేగించాలి.
4. తర్వాత అందులోనే అల్లం తురుము వేసి మరో రెండు నిముషాల వేగించుకోవాలి.
5. ఇప్పుడు టమోటో ముక్కలు మరియు ఉప్పు వేసిగా కలియబెట్టాలి. అలాగే కారం, దనియాల పొడి కూడా వేసి కలుపుతూ వేగించాలి.
6. టమోటో కొద్దిగా మెత్తబడ్డాక అందులో ఉడికించుకున్న రాజ్మాను వేసి, వేగుతున్న మసాల మిశ్రమంతో బాగా మిక్స్ చేయాలి.
7. ఇప్పుడు ముందుగా వంపి పెట్టుకొన్న రాజ్మా నీరును పోసి మసాలా అంతా గ్రేవీలా తయారయ్యేలా బాగా మిక్స్ చేసి, బాగా ఉడికించుకోవాలి . చివరగా గరం మసాలా వేసి కలియబెట్టాలి.
8. రాజ్మా గ్రేవి చిక్కబడ్డతర్వాత, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, స్టౌ మీద నుండి దింపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ ను మిక్స్ చేసి ప్లైయిన్ వైట్ రైస్ లేదా సఫ్రాన్ రైస్ తో వడ్డించాలి.

English summary

Kashmiri Rajma Masala Recipe | కాశ్మీర్ రాజ్మా మసాలా

Kashmiri rajma masala is a delicacy from the beautiful valley of Kashmir. You must be aware that there are mainly 2 varieties of rajma available in the market. One is the white rajma that is grown in Punjab and the other is the red rajma that comes from Kashmir. It is the red rajma that is used for making Kashmiri rajma masala.
Desktop Bottom Promotion