For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేరళ బిర్యానీ రిసిపి: రంజాన్ స్పెషల్

|

పండగ సమయాల్లో చాలా స్పెషల్ గా వంటలు వండుకోవాలని అందుకు ముందు నుండే ప్రిపేర్ అవుతుంటారు. ముఖ్యంగా సంవత్సరానికి ఒక సారి వచ్చే రంజాన్ ను ముస్లీంలు చాలా స్పెషల్ గా, అత్యంత భక్తి శ్రద్దలు, ఉపవాసాలను రంజాన్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. వీరి పండుగలకు ముఖ్యంగా మాంసాహార వంటలు ప్రత్యేకంగా వండుకుంటారు.

మాంసాహార వంటల్లోనే వివిధ వెరైటీలను వండి అథితులతకు ఆతిద్యం ఇస్తుంటారు. ముఖ్యంగా మాంసాహార వంటల్లో బిర్యానీకి ఎక్కువగా ప్రాధన్యం ఇస్తారు. బిర్యానీ కూడా వివిధ రకాలుగా తయారు చేస్తారు. ఉదా: చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బీఫ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ. ఇలా వేటికవే ఫేమస్. మరి కేరళ స్టైల్లో బిర్యానీ ఎలా తయారు చేయాలో బోల్డ్ స్కై ప్రత్యేకంగా అంధిస్తోంది. మరి దీని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం....

Kerala Biriyani Recipe For Ramzan

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500grms
బిరియానీ రైస్: 400grms
నెయ్యి: 1cup
వేరుశెనగలు: 20
ఉల్లిపాయలు: 2 + 2(సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 tbps
పసుపు: 1tsp
రెడ్ చిల్లి పేస్ట్: 2tbsp
నిమ్మకాయ: 1
పచ్చిమిర్చి: 8
టమోటాలు: 2
కరివేపాకు ఆకులు: 10
కొత్తిమీర: 2కాడలు(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నూనె: 1cup
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత చికెన్ ముక్కలను ఒక బౌల్లో వేసి అందులో కారం, పసుపు మరియు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత డీప్ బాటమ్ పాన్ స్టై మీద పెట్టి , చికెన్ ముక్కలను వేసి 10నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత చికెన్ ముక్కలను పక్కన తీసి పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే అదే నూనెలో ఉడికించిన గుడ్లను కూడా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు.
5. ఇప్పుడు మిగిలిన నూనెలో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కులు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 3-4నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. టమోటో మరియు పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా ఉప్పును చిలకరించి, 3, 4నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు అందులోనే చిల్లీపేస్ట్, పసుపు, కరివేపాకు మరియు కొత్తిమీర కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. తర్వాత ముందుగా ఫ్రై చేసుకొన్న చికెన్ ముక్కలను ఇందులో వేసి మిక్స్ చేసి రెండు కప్పుల నీరు పోసి, మూత పెట్టి, మరో పదినిముషాలు మీడియం మంట మీద ఉడికించాలి.
9. అంతలోపు, డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి క్రిస్పీగా వచ్చేవరకూ వేగించి, వాటిని తీసి పక్కన పట్టుకోవాలి .
10. అదే నెయ్యిలో వేరుశెనగలు వేసి, 2-3నిముషాలు ఫ్రూ చేసుకోవాలి. ఫ్రై చేసుకొన్న వేరుశెనగలను పక్కకు తీసి పెట్టుకోవాలి.
11. ఇప్పుడు పాన్లో బిర్యానీ రైస్ వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేయాలి. తర్వాత అందులోనే2-3కప్పుల నీళ్ళు పోసి పది నిముషాలు ఉడియించుకోవాలి .
12. ఇప్పుడు ఒక లార్జ్ మైక్రోవేవ్ ను ప్రూఫ్ బౌల్ తీసుకొని అందులో లేయర్స్ గా రైస్ ను మరియు చికెన్ కర్రీని సర్దాలి.
13. బౌల్ కు మూత పెట్టి ఓవెన్ ను 80డిగ్రీలో పెట్టి 8-10నిముషాలు ఉడికించుకోవాలి.అంతే కేరళ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ.

English summary

Kerala Biriyani Recipe For Ramzan

Thalassery biriyani is a recipe that hails from Kerala. This recipe for Kerala biriyani is different from all others because it uses fried chicken and eggs instead of curried chicken. The fried chicken, peanuts and yellow saffron rice come together to lend a unique flavour to this dish. Try out this Ramzan recipe during Iftar and also for Eid.
Story first published: Tuesday, July 22, 2014, 13:09 [IST]
Desktop Bottom Promotion