For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేడీస్ ఫింగర్ డ్రై ఫ్రూట్ మసాలా ఫ్రై

|

సాధారణంగా చాలా మందికి బెండకాయ తినడం అంటే ఇష్టం ఉండదు. అయితే బెండకాయలను సరైన పద్దతిలో అనుసరించినట్లైతే, బెండకాయలను క్రిస్పిగా తయారుచేయవచ్చు . మనం రెగ్యులర్ గా తయారుచేసుకొనే బెండకాయ సాంబర్, బెండకాయ మసాలా కంటే ఒక డిఫరెంట్ టేస్ట్ మరియు ఫ్లేవర్, స్ట్రక్చర్ కలిగిన బెండి ఫ్రై తయారుచేసి సైడ్ డిష్ గా తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా బెండకాయ ఫ్రైకి కొద్దిగా డ్రైఫ్రూట్స్ మసాలా జోడించడం వల్ల మరింత రుచిగా ఉంటుంది అంతే కాదు ఆరోగ్యం కూడా....

అయితే ఇది చేసే విధానంలోనే వుంది అసలు రుచి అంతా. ఎవ్వరైనా సరే రెండు ముద్దలు ఎక్కువ తినితీరాల్సిందే. మీకూ తెలిసే వుంటుంది ఎలా చేయాలన్నది. కానీ వాటిని వేయించే దానిలోనే వుంది చిట్కా అంతా...కొద్దిగా టైం తీసుకొని ఓపిగ్గా చేస్తే బెండకాయ ఫ్రై భలే రుచిగా ఉంటుంది. చపాతీ, ప్లెయిన్ రైస్ కు చాలా రుచికరంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం..

 Ladies Finger-Dry Fruit Masala Fry

Image Courtesy: yummytummyaarthi

కావల్సిన పదార్థాలు:
బెండకాయలు: 1/4kg(శుభ్రంగా కడిగి తేమ పూర్తిగా తుడిచి గాట్లు పెట్టాలి)
నూనె: ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు: రుచికి తగినంత
పసుపు : కొద్దిగా

మసాలా కోసం:
బాదం: 5
వాల్ నట్స్ : 5
జీడిపప్పు: 10
శెనగపప్పు: 1tbsp
ధనియాలు: 1/2tbsp
జీలకర్ర: 1/2tbsp
వెల్లుల్లి రెబ్బలు: 6
ఎండుమిర్చి : 6

తయారుచేయు విధానం :
1. ముందుగా మసాలా కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్ని మసాలా తయారుచేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, శెనగపప్పు వేసి లైట్ బ్రౌన్ కలర్లోకి వేగించుకోవాలి.
3. అవి వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి వేయించుకుని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి.
4. వేయించినవి చల్లబడిన తర్వాత మిక్సీ జార్ లో వేసి, మెత్తగా పౌడర్ చేయాలి. అందులోనే తగినంత ఉప్పు, పసుపు కలిపి మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
5. ఇలా తయారుచేసుకొన్నడ్రై ఫ్రూట్ మసాలా పొడిని గాట్లు పెట్టుకొన్న బెండకాయల్లో స్టప్ చేయాలి. లేదా ఫ్రైచేసి పొడి చల్లుకోవచ్చు.
6. ఇప్పుడు పాన్ లో మిగిలిన నూనె వేసి, స్టఫ్డ్ బెండకాయ ముక్కల్ని అందులో వేసి జాగ్రత్తగా 20 నిముషాల పాటు వేయించుకోవాల. అంతే డ్రై ఫ్రూట్ బెండీ ఫ్రై రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి మంచి కాంబినేషన్ .

English summary

Ladies Finger-Dry Fruit Masala Fry: Telugu Vantalu

Do you know how to prepare ladies finger Fry using dry Fruits? Check out and give it a try...
Story first published: Tuesday, August 18, 2015, 15:32 [IST]
Desktop Bottom Promotion