For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ పేషంట్స్ కొరకు స్పెషల్ లెమన్ ఓట్స్ రిసిపి

|

ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు. ఆధునిక జీవనశైలి, నిద్రలేమి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కారణాలచేతు డయాబెటిస్ బారీన పడుతున్నారు. డయాబెటిస్ లక్షణాలు కనిపించన వెంటనే, వైద్యచికిత్స తీసుకోవాలి. వాటితో పాటు ఆహారపు, అలవాట్లు మార్చుకోవాలి. ఆహారం విషయంలో ప్రత్యేమైన డైట్ ను అనుసరించాలి.

మధుమేహగ్రస్తులు పాటించే డైట్ ఆరోగ్యానికి మేలు చేసివై ఉండాలి . హెల్తీ డైట్ తీసుకొనే వారు వారు షుగర్ లెవల్స్ ను క్రమబద్ద చేసుకోవాలి. కాబట్టి, ఉదయం లేదా లంచ్ టైమ్ లో తీసుకొనే ఆహారాలు తేలికగా జీర్ణం అయ్యేవిగా మరియు ఇన్సులిన్ లెవల్స్ ను క్రమబద్దం చేసేటివిగా ఉండాలి. అటువంటి ఆహారాల్లో ఓట్స్ ఒకటి. ఓట్స్ ప్లెయిన్ గా తినడం వల్ల బోరుకొడుతుంటే వాటిని కొంచెం డిఫరెంట్ గా తయారుచేసుకోవాలి. ఓట్స్ మీ డైలీడైట్ లో చేర్చుకోవడం వల్ల డైయాబెటిక్ పేషంట్స్ కోసం ఓట్స్ తో తయారుచేసే ఒక స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ లెమన్ ఓట్స్ చాలా సులభంగా మరియు టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఒక సారి చూద్దాం...

Lemon Oats Recipe For Diabetics

కావల్సి పదార్థాలు:
ఓట్స్: 2 cups
నీళ్ళు: 1 కప్
నిమ్మరసం: 2tsp
పసుపు: ఒక చిటికెడు
వేరుశెనగ: 1tbsp (వేయించినవి)
ఆవాలు: ½tbsp
శెనగపప్పు: 1tbsp
ఉద్దిపప్పు: 1tbsp
పచ్చిమిరపకాయలు: 2 (చిన్న సైజు ముక్కలుగా కట్ చేయాలి)
రెడ్ చిల్లీస్: 1 (మద్యకు కట్ చేసుకోవాలి)
కవివేపాకు: 10 nos
ఇంగువ: ½చిటికెడు
ఆయిల్ : వేగించడానికి సరిపడా
ఉప్పు : రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ఒక రుచికరమైన లెమన్ ఓట్స్ తయారుచేయాలంటే ముందుగా మీరు పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. నూనె వేడి అవ్వగానే అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
2. ఇప్పుడు అందులో పోపుకు రెడీ సిద్దం చేసుకొన్న దాల్స్ ను వేసి, మీడియం మంట మీద నిధానంగా వేగించుకోవాలి. ఇవి లైట్ గా బ్రౌన్ కలర్ లో వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి. నిధానంగా వేగించుకోవాలి . అలాగే అందులో ఇంగువ కూడా వేసి ఒక సెకన్ వేగనివ్వాలి.
4. తర్వాత అందులో పసుపు, నీళ్ళు మరియు ఉప్పు వేసి మిక్స్ చాలి. ఈ మిశ్రమం మెత్తం బాగా ఉడుకుతున్న సమయంలో అందులో ఓట్స్ వేసి బాగా మిక్స్ చేయాలి.
5. మీడియం మంట మీద బాగా ఉడికించుకోవాలి.
6. ఓట్స్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో నిమ్మరసం మిక్స్ చేసి మరో 5నిముషాలు ఉడికించాలి.
7. ఓట్స్ మెత్తగా ఉడికిందని నిర్ధారించుకొన్న తర్వాత, రోస్ట్ చేసిన వేరుశెనగింజలతో గార్నిష్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేాయలి.

English summary

Lemon Oats Recipe For Diabetics


 It's World Diabetes Day today. So, Boldsky introduces you to one of the best breakfast recipes you can try out this morning. There are more than a million people in India itself who are battling this disease. It is one of those diseases where in which you need to eat healthy and most importantly eat the right type of foods.
Story first published: Friday, November 15, 2013, 11:48 [IST]
Desktop Bottom Promotion