For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లెమన్ పోహా-హెల్తీ లోఫ్యాట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

By Saraswathi
|

పోహా ఒక డిఫరెంట్ టేస్ట్ లోక్యాలరీలు కలిగి బ్రేక్ ఫాస్ట్ దీన్ని చాలా మంది ఇష్టపడుతారు. ఇది ఉదయం తయారుచేసే సులభమైన అల్పాహర వంట మాత్రమే కాదు,చాలా తక్కువ సమయంలో రుచికరంగా తయారుచేసే బ్రేక్ ఫాస్ట్ కూడా.

పోహాను వివిధ రకాలుగా తయారుచేస్తారు. కొన్ని మసాలా దినుసులను జోడించి చాలా ఇష్టంగా మరియు సులభంగా తయారుచేసుకుంటారు. కానీ, చాలా మంది నిమ్మరసాన్ని జోడించి తయారుచేయడం చాలా తక్కువ. ఈ సిట్రస్ ఫ్రూట్ ఈ పోహాకు కొద్దిగా పులుపు రుచిని మరియు మంచి ఫ్లేవర్ ను అందిస్తుంది. మరియు ఇది హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కూడా, మరి ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Lemon Poha Breakfast Recipe

కావల్సిన పదార్థాలు:
పోహా(అటుకులు): 3cups
నిమ్మకాయ - 2(మద్యలోకి కట్ చేసి, రసం తీసుకోవాలి)
ఆవాలు - 1 tbsp
ఇంగువ - 1 చిటికెడు
పచ్చిమిర్చి - 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ -2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
బంగాళ దుంపలు - 1 (ఉడికించి మరియు కట్ చేసుకోవాలి)
వేరుశెనగ - 1 cup
పసుపు - 1 చిటికెడు
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర - 1 రెమ్మ
ఉప్పు- రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. లెమన్ పోహా తయారుచేయడానికి ముందుగా పోహా(అటుకులు)ను నీటిలో కడిగి తర్వాత మంచి నీళ్ళు పోసి 10నిముషాలు నానబెట్టుకోవాలి. అటుకులు కొద్దిగా మెత్త బడ్డాక లెమన్ పోహా తయారుచేయాలి.
2. డీప్ ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి మీడియం మంట మీద వేడిచేయాలి. నూనె వేడయ్యాక అందులో ఇంగువ, ఆవాలు వేసి ఒక సెకను వేగించాలి.
3. ఇప్పుడు పాన్ లో ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి వేసి బాగా అన్నింటిని వేయించుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో ఉడికించి కట్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. వాటితో పాటు కరివేపాకు మరియు పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి.
5. 5నిముషా తర్వాత అందులో వేరుశెనగలు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని వేయించుకోవాలి. వేరుశెనగ కొద్దిగా బ్రౌన్ కలర్ కు మారే వరకూ వేయించుకోవాలి.
6. మొత్తం మిశ్రమం అంతా వేగిన తర్వాత నీటిలో నానబెట్టుకొన్న అటుకులను నీరు పూర్తిగా వంపేసి, అటుకులను ఫ్రైయింగ్ పాన్ లో వేసి, నిధానంగా మిక్స్ చేస్తూ అన్నింటిని వేయించుకోవాలి.
7. పది నిముషాల తర్వాత ఉప్పు కూడా వేసి పూర్తిగా కలగలిపి మంటను తగ్గించేయాలి.
8. ఇప్పుడు పాన్ ను స్టౌ మీద నుండి క్రిందికి దింపుకొని నిమ్మరసాన్ని చిలకరించి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలపాలి.
9. చివరగా కొత్తిమీర తరుగుతో పోహాను గార్నిష్ చేయాలి. హెల్తీ లెమన్ పోహా రిసిపి రెడీ . ఈ పోహా రిసిపిని వేడిగా లేదా చల్లగా తినవచ్చు.

English summary

Lemon Poha Breakfast Recipe

Poha is one such dish that is loved by a lot of people. It is not only an easy breakfast recipe to prepare in the early hours of the morning but also a tasty one too. Poha is nothing but beaten rice, if you are unaware of what it actually is.
Desktop Bottom Promotion