For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తింటే....రుచి అద్భుతం.... !

By B N Sharma
|

Luchi and Aloo Dum!
చపాతి, పూరీ వంటివి తినాలంటే పక్కన సైడ్ డిష్ గా ఏదో ఒక కూర కూడా తప్పక వుండాలి. సాధారణంగా ఇంట్లో రాత్రిపూట చేసే చపాతీలు లేదా దోశలు లేదా పూరీలలో బంగాళ దుంప కూర చేయటం అలవాటుగా వుంటుంది. చపాతి వంటి వాటితో బంగాళ దుంప కూర తింటే రుచి ఎంతో అద్భుతంగా వుంటుంది. దీనినే ఆలూ దమ్ అని కూడా పిలుస్తారు. ఆలూ దమ్ తయారీకి కావలసిన పదార్ధాలేమిటి, తయారీ విధానమేమిటనేది పరిశీలిద్దాం

కావలసిన పదార్ధాలు -
ఉల్లిపాయ పెద్దవి 2, వెల్లుల్లి రెబ్బలు 10 నుండి 12, అల్లం 2 టేబుల్ స్పూన్లు, బంగాళదుంపలు చిన్నసైజువిగా అర కిలో, పచ్చి బటానీలు అరకప్పు, వంటనూనె 3 టేబుల్ స్పూన్ లు, కొత్తిమీర కొద్దిపాటిగా చల్లటానికి, ఉప్పు రుచికి తగినట్లు.

ముందుగా బంగాళ దుంపలు నీటిలో ఉడికించి తొక్క తీయాలి. బాండ్లీలో నూనె వేయించి పోపు పదార్ధాలతో పోపు పెట్టండిదానిలోనే ఉల్లిపాయల ముక్కలు, వెల్ల్లుల్లి్ల రెబ్బలు వేసి బాగా వేయించండి. దానికి అల్లం రసం కలపండి. ఈ మిశ్రమానికి పచ్చిబటానీలు కూడా కలిపి కొద్దిగా నీరుపోసి బాగా ఉడికించండి. ఇక ఆపై అప్పటికే ఉడికించిన బంగాళ దుంపలను వాటిలో వేసి బాగా మెత్తగా తయారు చేయండి, దానిపై కొత్తిమీర చల్లితే, చూడటానికి, తినటానికి కూడా అద్భుతంగా వుంటుంది.

English summary

Luchi and Aloo Dum! | బంగాళదుంప కూర్మా!

Cut the Potatoes into small pieces, boil them in hot water till they get softness. Peel off the skin. Put oil in a nonstick bandli and fry the spicy ingredients. Add soaked peas and cut onions to the mixture and boil it for some time. Later put in this bandli the peeled off potatoes and further boil for five minutes. Mash the ingredients thoroughly and your mouth watering aloo dum curry, will be ready for serving hot.
Story first published:Monday, January 9, 2012, 14:27 [IST]
Desktop Bottom Promotion