For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహారాష్ట్రియన్ స్పెషల్ వెజ్ కొల్లాపురి గ్రేవీ రిసిపి

|

మన ఇండియన్ వంటకాల్లో మహారాష్ట్ర ఫుడ్స్ కూడా చాలా టేస్టీగా వెరైటీగా ఉంటాయి. అలాంటి వంటకాల్లో ఒకటి కొల్హాపురి గ్రేవీ రిసిపి ఒకటి. వివిధ రకాల వెజిటేబుల్స్, మసాలాలలో, బట్టర్ తో తయారుచేసి ఈ రిసిపి నోరూరిస్తూ స్పైగా ఉంటుంది.

చాలా సింపుల్ గా మరియు ఈజీగా తయారుచేసే ఈ వంట రైస్, రోటీలకు మంచి కాంబినేషన్ . ముఖ్యంగా ఈ వెజిటేరియన్ రిసిపి మహారాష్ట్రాలో చాలా ఫేమస్ అయిన వంట. మరి ఫేమస్ వంటను మనం కూడా రుచి చూడాలంటే తయారుచేసే విధానం తెలుసుకోవాలి...

Maharashtrian Special Veg Kolhapuri Gravy Recipe: Telugu Vantalu

శెనగపిండి - 1 cup
క్యారెట్ - 1 cup
క్యాప్సికమ్ - 1 cup
పనీర్ - 1 cup
క్యాలీఫ్లవర్ - 1 cup
పచ్చిబఠానీలు - 1 cup
టమోటోలు - 2
జీడిపప్పు - 10 ( soaked for one hour)
పచ్చిమర్చి - 4 to 5
గరం మసాల - 1 tsp
పసుపు - 1 tsp
కారం - 1 tsp
బిర్యానీ ఆకు - 1 to 2
జీలకర్ర - 1/2 tsp
అల్లం - 1/2 tsp
బట్టర్ - 1 tbsp Oil
నూనె: సరిపడా

తయారుచేయు విధానం:
1. వెజిటేబుల్స పాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేసి వెజిటేబుల్స్ ఫ్రై అవుతుండగా, అందులో కాలీప్లవర్, పనీర్ వేసి సన్నని మంట మీద ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత అందులోనే బీన్స్, క్యారెట్, మరియు క్యాప్సికమ్ కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు టమోటోలను ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యక జీలకర్ర, కరివేపాకు, పసుపు, అల్లం, కారం వేసి వేగించాలి.
5. తర్వాత అందులోనే గరం మసాలా, కారం, నీళ్లు పోసి గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.
6. 5నిముషాల తర్వాత, టమోటో జీడిపప్పు పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్స్ చేస్తూ , బట్టర్ మిక్స్ చేసి ఉడికిస్తే గ్రీవీ చిక్కబడుతుంది .
7. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే సరి కోల్హాపురి గ్రేవీ మహారాష్ట్ర స్పెషల్ డిష్ రెడీ...

English summary

Maharashtrian Special Veg Kolhapuri Gravy Recipe: Telugu Vantalu

Maharashtrian Special Veg Kolhapuri Gravy Recipe, The only state in India where all the spices are perfectly used in food recipes is the Maharashtra. Yes, you can find a mixture of spicy foods, sweets and mild dishes.
Story first published: Saturday, October 31, 2015, 16:51 [IST]
Desktop Bottom Promotion