For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మామిడి పులావ్-సమ్మర్ స్పెషల్

|

సమ్మర్ స్పెషల్ అంటేనే మామిడికాయల సీజన్ చాలా మందికి మామిడి పండ్లన్నా..కాయలన్నా చాలా ఇష్టం అంతే కాదు. పచ్చి మామిడియాలతో ఊరగాలు పెడతారు. సంవత్సరమంతాయు ఆ రుచిని ఆశ్వాదిస్తుంటారు. ఒక్క ఊరగాయలు మాత్రమే కాదు. మామిడి పులిహోర, మామిడితో జ్యూసుల, మామిడి లస్కీ, వివిధ గార్నిష్ లలో మామిడి పండును ఉపయోగిస్తుంటారు.

పచ్చిమామిడిని వివిధ రకాల కర్రీల్లో కూడా చేర్చి వండుతుంటారు. వీటిటేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మామిడి తురుముతో పులవావ్ చేస్తే తియ్యతియ్యని పుల్లపుల్లని టేస్ట్ తో నోరూరిస్తుంటుంది. మరి మామిడి పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

బాస్మతి రైస్: 2cups(శుభ్రం చేసి నీటిలో నానబెట్టుకోవాలి)
పచ్చిమామిడి: 1 ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా తురుముకోవాలి)
జీలకర్ర: 1/2 tsp
పచ్చిమిర్చి: 2 (slit)
చెక్క: చిన్న ముక్క
యాలకులు: 4
లవంగాలు: 4
మిరియాలు: 6
నెయ్యి: 1tbsp
పసుపు: 1/2 tsp
జీలకర్ర: 1tsp
అల్లం: 1చిన్న ముక్క(తురుము కోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా

Mango Pulao

తయారు చేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర మరియు పచ్చిమిర్చి ముక్కలు, చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి రెండు నిముషాలు లైట్ గా వేగించుకోవాలి.
2. ఒక నిముషం తర్వాత అల్లం తురుము వేసి మరో నిముషం వేగించాలి.
3. ఇప్పుడు అందులోనే పచ్చిమామిడి తురుము వేసి తక్కువ మంట మీద ఐదు నిముషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
4. అందులోనే పసుపు ఉప్పు వేసి మరో నిముషా వేగించి, తర్వాత శుభ్రం చేసినానబెట్టుకొన్న బియ్యాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
5. ఇప్పుడు అందులో 3కప్పుల నీళ్ళు పోసి ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
7. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఐదు నిముషాల తర్వాత మూత తీసి మాంగో పులావ్ ను గరం మసాల మరియు కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేయాలి. అంతే సమ్మర్ స్పెషల్ మాంగో పులావ్ రెడీ.

English summary

Mango Pulao: A Tangy Summer Recipe | సమ్మర్ స్పెషల్ మామిడి పులావ్

In India, people wait for the scorching heat of the summer for just one reason, mangoes. Summers are 'aam ka season' in the subcontinent. That is why, mango recipes are in vogue at this time. Mangoes are eaten in various forms every summer.
Story first published: Saturday, April 13, 2013, 11:07 [IST]
Desktop Bottom Promotion