For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యాంగో పులిహోరా(మ్యాంగో రైస్): ఉగాది స్పెషల్

|

వేసవికాలం వచ్చిందంటే చాలు.. లేలేత మామిడికాయల వగరు.. పులుపు నోరూరిస్తాయి. మామిడికాయ తో చేసిన వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి.ఈ కాలంలో మాత్రమే లభించే మామిడికాయతో చేసే ఎన్నో వంటకాలు భానుడితాపాన్ని సైతం భరించేలా చల్లదనానిస్తాయి.

లేత మామిడితొక్కు.. చిన్నచిన్న ముక్కల పచ్చడి, కొబ్బరితో కలిపి పచ్చడి, మామిడి కాయ పప్పు, మామిడి కాయ చారు, మామిడి కాయ షర్భత్‌, పులిహార ఇలా ఎన్నో వె రైటీలకు మామిడికాయ పెట్టింది పేరు. ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని రుచికరమైన వంటకం మామిడికాయ పులిహోర. ఉగాది స్పెషల్ గా మామిడికాయ పులిహోర ను ఎలా

తయారుచేయాలో చూద్దాం...

కావల్సి పదార్థాలు:

రైస్: 3cups( అన్నం పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకోవాలి)
పచ్చిమామిడికాయ తురుము: 11/2 cup(పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి)
వేరుశెనగలు: 5-6tbsp( వేగించినవి)
జీడిపప్పు :2tbsp(రోస్ట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
పోపు కోసం:
నూనె: 1 1/2tbsp
ఆవాలు: 1tbsp
శెనగపప్పు: 1tbsp
ఉద్దిపప్పు: tbsp
ఎండు మిర్చి: 3-4
పచ్చి మిర్చి: 6-8(మద్యలోకి కట్ చీలికగా కట్ చేసి పెట్టుకోవాలి)
తురిమిన అల్లం: 1tsp
ఇంగువ: 1/4tsp
పసుపు: 1/4 tsp
కరివేపాకు: రెండు రెమ్మలు

తయారుచేయు విధానం :

1. ముందుగా మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేయాలి.
2. ఆవాలు చిటపలాడిన తరవ్ాత అందులో శెనగపప్పు, ఉద్దిబాళ్ళు, వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. వెంటవెంటనే అందులో పచ్చిమిర్చి, ఎండు మిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, అల్లం, పసుపు మరియు ఇంగువ వేసి, కొన్ని సెకండ్లు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
3. పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమామిడి తురుము వేసి మరోకొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులోనే రోస్ట్ చేసి పెట్టుకొన్నవేరుశెనగలు మరియు జీడిపప్పు వేసి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకొన్న అన్నంను పోపులో వేసి, ఉప్పు చిలకరించి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో తెలుకొని సరిపడా వేసి మిక్స్ చేసి అడ్జెస్ట్ చేసుకోవాలి.
6. అంతే మామిడికాయ పులిహోర రెడీ. ఉగాది స్పెషల్ గా మామిడికాయ పులిహోరతో పాటు సైడ్ గా వడియాలు, పెరుగు లేదా పచ్చడితో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.

English summary

Mango Pulihora(Mango Rice): Ugadi Special

Our Ugadi festive meal was simple and not elaborate. Mamidikaya Annam (green mango rice), a South Indian rice delicacy, prepared on the same lines as lemon rice (nimmakaya annam) and is the most simple and easiest recipe one can ever make.
Desktop Bottom Promotion