For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీటేస్టీ మెంతిబాత్‌

|

Menthi Bath
కావలసిన పదార్థాలు:
మెంతికూర కట్టలు: 2
పెద్దఉల్లిపాయ: 1(తరగాలి)
టమోటాలు: 3(సన్నగా తరగాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
అన్నం: 2cups
కరివేపాకు: నాలుగురెబ్బలు
జీలకర్ర:1tsp
జీడిపప్పు: 10
గరం మసాలా: 1tsp
ఉప్పు: రుచికితగినంత
కొత్తిమీర: కట్ట
నూనె: కావలసినంత

తయారు చేయు విధానము:
1. మొదట మెంతికూరను శుభ్రంగా కడిగి.. తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మందపాటి గిన్నెలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి.
3. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, గరంమసాలా, టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికించాలి.
4. తరవాత మెంతికూర తరుగు చేర్చి మూత పెట్టాలి. కూరలో నీరంతా ఇంకిపోయాక అన్నం, ఉప్పు జోడించి సన్నటి మంట ఉంచాలి. ఐదు నిమిషాలయ్యాక జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీరతో అలంకరించి దించేస్తే సరి మెంతీబాత్ రెడీ..

English summary

Menthi Leaves | Tomato | Garlic | Onion | Cumin | Oil | Salt | టేస్టీటేస్టీ మెంతిబాత్‌

Menthi leaves bath: for diabetics to help improve their sugar levels and enhance their energy levels.
Story first published:Friday, April 8, 2011, 16:01 [IST]
Desktop Bottom Promotion