For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేతి పన్నీర్ రైస్ రిసిపి: టేస్టీ అండ్ హెల్తీ ..

|

మేతి (మెంతి ఆకు)చాలా పాపురల్ గ్రీన్ హెర్బ్. ఈ మెంతిఆకులను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మెంతితో వివిధ రకాల వంటలను వండుతారు. ఈ మెంతి ఆకులు కొద్దిగా చేదు ఉండటం వల్ల చాలా మంది ఈ ఆకును ఉపయోగించరు. అయితే ఇందులో వివిధ రకాల విటమిన్స్, పోషకాలు, మినిరల్స్ ఉన్నాయి. ఇంకా ప్రోటీలను, ఐరన్, క్యాల్షియం, విటమిన్స్ మరియు పొటాషియం అధికంగా ఉన్నాయి.

ఇంత గొప్ప ప్రయోజనాలున్న ఈ ఆకుకూరతో పులావ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. బిటర్ టేస్ట్ ఉండకూదనుకుంటే, ఇందులో పనీర్,లెమన్ జ్యూస్ వంటి వాటిని జోడించి చేస్తే చాలా రుచికరంగా వెరైటీగా ఉంటుంది. కావాలంటే మీరూ ఒక సారి ట్రై చేసి చూడండి...

Methi Paneer Rice

మెంతిఆకులు : 2 కట్టలు ( 150 gms) (శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పన్నీర్: 1 cup (కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 1/2 cup (సన్నగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 5 to 6 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నిమ్మకాయ: 1 రసంతీసి పక్కన పెట్టుకోవాలి
బియ్యం: 1 cup
ఉప్పు : రుచికి సరిపడా
గరం మసాలా: 1/2 tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పనీర్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడి అయ్యాక అందులో పనీర్ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
2. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడి చేసి, అందులో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులోనే సన్ గా తరిగిన మెంతి ఆకులలు, పచ్చిమిర్చి వేసి 1 నిముషం వేగించుకోవాలి.
4. తర్వాత ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకొన్న బియ్యం, సరిపడా నీళ్ళు పోయాలి. దీనితో పాటే గరం మసాలా, నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేసి, అన్నం వండుకోవాలి.
5. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న పనీర్ ముక్కలను వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి. అంతే మేతీ పనీర్ రైస్ రెడీ, వేడి వేడిగా సర్వ్ చేయాలి.
6. మీకు నచ్చిన రైతాతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

English summary

Methi Paneer Rice

Here is a recipe of Methi Paneer Rice which you can make for lunch. This Methi Paneer Rice is very nutritious meal with the goodness of methi leaves.
Story first published: Tuesday, May 24, 2016, 12:09 [IST]
Desktop Bottom Promotion