For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లాక్ బీన్స్-చిక్ పీస్ రైస్: టేస్టీ అండ్ హెల్తీ

|

ఇండియన్ కుషన్స్ లో రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ చాలా పాపులరైనటువంటి సైడ్ డిష్. ముఖ్యంగా రాజ్మా వంటలను నార్త్ స్టేట్స్ లో ఎక్కువుగా తయారుచేస్తారు. వీటిని బీన్స్ గా పిలుచుకొనే సౌత్ స్టేట్స్ లో కూడా వీటిని ఎక్కువగా వండుతారు. రాజ్మా పొట్టనిండినట్టు చేస్తే ఒక ఫైబర్ రిచ్ ఫుడ్.

రాజ్మాను వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా వీటితో తయారుచేసే కర్రీస్ కు ఎక్కువ క్రేజ్. కర్రీలు మాత్రమే కాకుండా రాజ్మాతో బిర్యానీ మరియు పులావ్ ను కూడా తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రోజంతా హెల్తీగా ఉండేందుకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ , మీల్స్, డిన్నర్ కూడా తీసుకుంటారు. రాజ్మాకు, చిక్ పీస్(శెనగలు) కూడా జోడించి మిడిల్ ఈస్ట్రర్ లో రైస్ ను చాలా టేస్టీగా వండుకు తింటారు.

బరువు తగ్గించుకోవాలనుకునే వారు, డైట్ ఫాలో అవయ్యేవారు, ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందాలనుకునే వారు ఈ హోల్ సమ్ మీల్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

రాజ్మా సాండ్విచ్ : హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రాజ్మా సాండ్విచ్ : హెల్తీ బ్రేక్ ఫాస్ట్

బ్లాక్ బీన్స్-చిక్ పీస్ రైస్: టేస్టీ అండ్ హెల్తీ

కావల్సిన పదార్థాలు:
నెయ్యి - 2 tbsp
బాస్మతి రైస్ - 2 cups (soaked)
ఉల్లిపాయ - 1 (chopped)
ధనియాలపొడి - 1 tsp
పెప్పర్ - 1 tsp
జీలకర్రపొడి - 1 tsp
పసుపు - 1 tsp
ఉడికించిన బీన్స్ - ½ cup
ఉడికించిన శెనగలు - ½ cup
రుచికి సరిపడా ఉప్పు

రాజ్మా మసాలా రిసిపి: పంజాబీ స్టైల్రాజ్మా మసాలా రిసిపి: పంజాబీ స్టైల్

తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి,అందులో నెయ్యి, ఉల్లిపాయలు వేయించుకోవాలి. తర్వాత కడిగిన బాస్మతి రైస్, మసాలాలు, ఉప్పు కూడా వేసి సున్నితంగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
2. మొత్తం మిశ్రమం వేగిన తర్వాత సరిపడా నీళ్ళు పోసి, ఉడికించాలి. బియ్యం ఉడుతున్నప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా, చిక్ పీస్ కూడా వేసి మిక్స్ చేయాలి

3. మొత్తం మిశ్రమాన్ని స్పూన్ తో బాగా కలిపి మంటను మీడియంగా ఉంచి, 5 నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ పూర్తిగా తగ్గించి, సిమ్ లో ఉంచి రెండు నిముషాలు ఉడికించుకోవాలి. ఆ రెండు నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి, రైస్ ను ఒక సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకుని, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

4. అంతే మిడ్ ఈస్ట్రర్ బ్లాక్ బీన్స్ చిక్ పీస్ రైస్ రెడీ . చాలా టేస్ట్ గా ఉంటుంది. పిల్లలకు కూడా లంచ్ బాక్స్ లకు పెట్టివ్వొచ్చు. సులభంగా తయారుచేసే ఇక సింపుల్ రైస్ రిసిపి

English summary

Middle Eastern Rice With Black Beans And Chickpeas

Do you know how to make this recipe? Actually, it is a simple recipe with a subtle Middle Eastern twist. Follow the procedure and do try it at home.
Story first published:Wednesday, July 12, 2017, 12:07 [IST]
Desktop Bottom Promotion