For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాటర్ కోఫ్తా కర్రీ

|

Mutter Kofta Curry
కావలసిన పదార్థాలు:
పచ్చి బఠానీ :1/2kg
సెనగపిండి: 2tsp
ఉల్లిపాయలు :2
పచ్చి మిర్చి:6
ఉప్పు: రుచికి తగినంత
కారం:1tsp
ధనియాల పొడి:1tsp
గరం మసాలా: 1/4tsp
పసుపు: 1/2tsp
బంగాల దుంపలు:2
నూనె: తగినంత
తయారు చేయు విధానం:

1. పచ్చి బఠానీలు ఉడికించి, మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి.
2. ఒక పాన్ లో నూనె వేసి కొన్ని ఉల్లిపాయముక్కల్ని వేసి వేయించాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, సెనగపిండి వేసి కొద్ది సేపు ఫ్రై చేయాలి. ఆ పైన బఠానీ పేస్ట్ వేసి కలిపి ముద్దలుగా (కోఫ్తాలు) చేసి నూనెలో వేయించాలి.
3. ఒక గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయముక్కలు వేయించి, అందులో కారం, ధనియాల పొడి, పసుపు వేసాక బంగాళా దుంప ముక్కలు కలిపి రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి.
4. గ్రేవి పూర్తిగా ఉడికాక, కొద్దిగా ఉప్పు చేర్చి అందులో ముందు గా వేయించి పెట్టుకున్న కోఫ్తాలు వేసి కదపకుండా కొన్ని నిమిషాలు ఉడికిస్తే మాటర్ కోఫ్తా కర్రీ రెడీ.

English summary

Green Pease | Onion | Green Chilli | Oil | Potato | Garam Masala | Salt | మాటర్ కోఫ్తా కర్రీ

North Indian Vegetarian:Aloo Mutter is one of the hugely popular Indian Veg. Food delicacies that is appetizing in taste and prepared, using fresh and seasonal potatoes and peas. The usage of high quality spices in our Aloo Mutter is help to provide it rich color and taste.
Story first published:Tuesday, February 8, 2011, 15:20 [IST]
Desktop Bottom Promotion