For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్ రాజ్మా మసాలా

|

Rajma Masala
రోజూ బీన్స్ తీసుకోవడం వల్ల డయాబెటిస్, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటాయని పరిశోధనల్లో తేలింది. పన్నెండు వారాల పాటు ఆరకప్పు ఉడికించిన బీన్స్ తీసుకున్న ఆరోగ్యవంతుల కొలెస్టరాల్ సైతం 8శాతం మేర తగ్గింది. ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్స్, ఎ1సి లెవెల్స్ పై బీన్స్ ప్రభావం చాలా ఉంటోంది. బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో వీటి పాత్ర చాలా ఎక్కువ. అంతేకాకుండా బీన్స్‌లో సాల్యుబుల్ ఫైబర్ పాళ్లు చాలా ఎక్కువ. కాబట్టి మీ మెనూలో బీన్స్ ఉండేలా చూసుకుని డయాబెటిస్‌కు, అధికరక్తపోటుకు చెక్‌ పెట్టండి. ఈ రాజ్మా (ఎర్ర బీన్స్) కర్రీ ముఖ్యంగా జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్ళే దారిలో వెజిటేరియన్ హోటళ్ళలో రైస్ తో పాటూ వడ్డిస్తారు. అందులో దాదాపు వంద గ్రాముల నెయ్యితో సహా. ఆ రుచి అనుభవిస్తేనే తెలుస్తుంది.

కావలసిన పదార్థాలు:
రాజ్మా: 2cups(నానబెట్టినవి)
ఉల్లిపాయలు: 2
టొమోటో: 1
అల్లం వెల్లుల్లి: 1tsp
పచ్చిమిర్చి: 4
టొమోటోలు: 3
ధనియాలపొడి: 1/2tsp
కారం: 1tsp
గరంమసాలా: 1/2tsp
ఆంచూర్(డ్రై మాంగో పౌడర్): 2tbsp
జీలకర్ర: 1tsp
నూనె: 2tsp
కొత్తిమీర: గుప్పెడు

తయారు చేయు విధానం:
1. రాజ్‌ మాను రాత్రంతా నానబెట్టి, బాగా కడిగి ప్రెషర్ కుక్కర్‌ లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. బాణెలిలో నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించాలి. కాసేపటి తరువాత ఉల్లిపాయ, టొమోటో ముక్కలను వేసి కలియబెట్టాలి.
3. కొద్దిసేపటి తరువాత అందులోనే ఉడికించిన రాజ్‌మా, కారం, ధనియాలపొడి, ఉప్పు, గరంమసాలాలను వేసి, బాగా కలిపి ఉడికించాలి:
4. మంట తగ్గించి గ్రేవీ చిక్కబడేంతదాకా ఉడికించి, కొత్తిమీర చల్లి దించేయాలి: అంతే రాజ్‌ మా మసాలా కర్రీ రెఢీ. రాజ్ మా మసాలా రైస్, పలావ్, పరాట, రోటీలకు మంచి కాంబినేషన్ మరి టేస్ట్ చూసేయండి...

English summary

Navratri Special Rajma Masala | నవరాత్రి స్పెషల్ రాజ్మా మసాలా

Rajma masala is a special Navratri recipe from the traditional kitchens of our grandmothers. Whenever there is a celebration we all crave for rajma chawal, such is the fame of rajma recipes in India. As the 9 day celebrations of Navratri or call it Durga Pooja for the eastern side of the country, is knocking on the doors you need to refresh your memory for dishing out some mouth watering festival food for your family. This Navratri recipe is where your search ends because there is not a soul in India who hates rajma masala.
Story first published:Tuesday, September 27, 2011, 16:46 [IST]
Desktop Bottom Promotion