For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓట్స్ ఉప్మా తయారుచేయటం ఎలా?

By B N Sharma
|

Oatsupma1
అందరకు తినడానికి ఇష్టమయ్యేది, ఆడవారు చేయటానికి తేలికంటూ ఇష్టపడేదీ ఉప్మా. అయితే, ఓట్స్ ఉప్మా ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం!
కావాల్సిన పదార్ధాలు:
రెండు కప్పులు ఓట్స్, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, రెండు టీ స్పూన్లు శనగపప్పు, ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు. కరివేపాకు, చిటికెడు ఇంగువ, ఒక టీ స్పూన్ ఆవాలు, మూడు పచ్చిమిరపకాయలు, రెండు ఎండు మిరప కాయలు, ఒక ఉల్లిపాయ, ఒక టీస్పూన్ నూనె, నాలుగున్నర కప్పులు నీరు, తగినంత ఉప్పు.

తయారు చేసే పద్ధతి:
పాన్ లో మూడు నిమిషాలపాటు ఓట్స్ వేయించి పక్కన పెట్టుకోండి. పాన్ లో అతి కొద్ది నూనె వేడిచేసి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండు మిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఉల్లి, అల్లంముక్కలు, కరివేపాకు కూడా వేయాలి.

ఉల్లిపాయలు వేగాక ఇంగువ, ఉప్పు కలిపి నీరు పోసి మరిగించాలి. ఓట్స్ వేసి, నీరంతా పీల్చేదాకా సన్నని సెగపై ఉడికించాలి. ఇక మీరు కోరే రుచికర ఓట్స్ ఉప్మా రెడీ. డయాబెటిక్స్ కు ఇది మంచి ఆహారం.

English summary

Oats Upma Preparation! | దీని తయారీ ఎంత తేలిక?

For preparation of Oats Upma we need two cups of Oats, One table spoon of black gram Dal, two tea spoons of Bengal gram, One tea spoon ginger pieces, a little curry leaves, very little asafotieda, green chillies, One Onion, four and half cups water, salt to the taste, etc.
Story first published:Tuesday, December 20, 2011, 14:25 [IST]
Desktop Bottom Promotion