For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొలస్ట్రాల్ ను తగ్గించే ఓట్స్ ఊతప్పం...

|

Oats Uttapam-Low Fat Breakfast
సాధారణంగా ఓట్స్ బరువు తగ్గించడానికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఓట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ అంటున్నారు. అలాంటప్పుడు అదే ఓట్స్ తో కొత్త కొత్త వంటకాలు సృష్టిస్తే ఎలాగుంటుంది. ఊరికే జావలా కాకుండా ఓట్స్ తో ఎన్నో రకాల భారతీయ వంటకాలు చేయవచ్చు .ఓట్స్ ను డైరెక్ట్ గా పాలతో తీసుకోలేని వారు. వారికి నచ్చిన వంటకంలా తయారు చేసుకొని తినవచ్చు. మరి ఓట్స్ తోఊతప్పచేసుకొంటే ఎలాఉంటుందోచూద్దాం..

కావలసిన పదార్ధాలు:
ఓట్స్:2 cups
బొంబాయిరవ్వ: 2cups
మైదాపిండి: 1cup
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి:4-6
కారట్ తురుము: 1/2cup
కరివేపాకు: ఒక రెమ్మ
కొత్తిమీర తరుగు: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
నూనె : సరిపడా

తయారు చేసే విధానం :
1. ముందుగా ఒక కప్పు ఓట్స్ ని మిక్సీ లో మెత్తగా పొడి చేసుకోవాలి.
2. తర్వాత బొంబాయిరవ్వ, ఓట్స్ పొడి, మిగిలిన ఓట్స్ , మైదాపిండి బాగా కలిపి నీళ్ళతో దోసెల పిండి లాగ కలుపుకుని, ఒక గంట నాననివ్వాలి. ఎంత ఎక్కువ నానితే అంతా బాగా వస్తాయి.
3. నానిన పిండిలో, ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ సన్నగా తరిగి కలపాలి.చివరగా క్యారెట్ తురుము,ఉప్పు కూడా వేసి కలిపుకోవాలి.
4. దోసెపిండి రెడీ. ఇప్పుడు దోశ పాన్ మీద నూనె వేసి వేడయ్యాక కొంచెం మందంగా ఊతప్పం లా వేసుకోవాలి. పలుచగా వేస్తే విరిగిపోతాయి. రెండు వైపులా వేగాక ఏదైనా చట్నీ తో సర్వ్ చెయ్యాలి. వేడిగా తింటే బావుంటుంది.

English summary

Oats Uttapam-Low Fat Breakfast | బరువును తగ్గించే ఓట్స్ఊతప్పం

If you want to enrich your diet with oats or just want to try something different and innovative, oats uttapam is just the thing. Very Healthy and quick dish to make.Yummy to taste!!
Story first published:Friday, August 3, 2012, 9:57 [IST]
Desktop Bottom Promotion