For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలక్ చోలే రిసిపి : తందూరి రోటి కాంబినేషన్

|

పాలకూర చాలా హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ . ఆరోగ్యం మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకొనే వారు, పాలకు కూరను వారంలో కనీసం రెండు మూడు సార్లు తీసుకుంటుంటారు. ఎందుకంటే ఇందులో ఆరోగ్యప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఆకుకూరలు కొద్దిగా బిట్టర్ టేస్ట్ ను కలిగి ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పాలకూరలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం మరియు మరిన్ని పోషకాంశాలున్నాయి .

ఆకుకూరకు పనీర్, మరియు చోలే మిక్స్ చేసినప్పుడు మంచి ఆరోమా వాసనతో పాటు మంచి టేస్ట్ కూడా కలిగి ఉంటుంది . ఈ రుచికరమైన కర్రీనీ తందూరి రోటిలతో కలిపి తీసుకుంటే చాలా రుచికంగా ఉంటుంది . ఈ హెల్త్ స్పీనాచ్ చోలె రిసిపి తయారుచేయడానికి ఏమేమి అవసరం అవుతాయి, ఎలా తయారుచేయాలి అనే పద్దతిని ఈ క్రింది విధంగా తెలుసుకోండి...

palak chole

కావల్సిన పదార్థాలు :
చోలే : 1/2cup
పాలక్ లేదా ఆకుకూరలు: 6cups
నీరు : 2cups
పచ్చి మిరపకాయలు : 4(సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటా : 1 (గుజ్జులా చేసుకోవాలి)
జీడిపప్పు : 1/2 cup
నూనె : 2tbsp
జీలకర్ర : 1tsp
ఉల్లిపాయ : 1(చిన్న ముక్కలుగా తరిగినవి)
అల్లం పేస్ట్ : 1tsp
వెల్లుల్లి పేస్ట్ : 1tsp
ధనియాల పొడి : 1tsp
గరం మసాలా : 1 tsp
ఉప్పు : రుచికి సరిపడా
కస్తూరి మెంతి: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆకుకూరను మరియు టమోటో శుభ్రం చేసి చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
2. తర్వాత జీడిపప్పును పౌడర్ గా చేసి పక్కన పెట్టుకోవాలి.
3. పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడి అయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయలు మరియు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి . తర్వాత అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న టమోటో ఆకుకూర పేస్ట్ ను వేయాలి.
5. పాన్ లో మసాలాతో పాటు ఇకు కూర బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలుతుంది. మొత్త మిశ్రమాన్ని కలగలుపుతూ మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి .
6. తర్వాత అందులో జీడిపప్పు పొడి మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
7. ఇలా మొత్తం ఉడికిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న శెనగలు(చోలే) వేసి మిక్స్ చేయాలి. కర్రీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి .
8.10నిముషాలు మీడియం మంట మీద ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే పాలక్ చోలే రెడీ..

English summary

Palak Chole Recipe For Tandoori Roti

Palak is one of the few green vegetables which is loved by many. This leafy veggie is slightly bitter to taste but it is surely good for health as it is rich in iron, calcium, magnesium and lots more.
Story first published: Wednesday, April 8, 2015, 13:29 [IST]
Desktop Bottom Promotion