For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలక్ పులావ్ రిసిపి: హెల్తీ అండ్ టేస్టీ

|

పలావ్ ను సాధారణంగా వివిధ రకాలుగా తయారుచేస్తారు. టమోటో పులావ్, పచ్చిబఠానీ, పొటాటో పులావ్, వెజిటేబుల్ పులావ్, సోయా బీన్ పులావ్ ఇలా వివిధ రకాలుగా తయారుచేస్తారు. అయితే ఆకు కూరలను వినియోగించి పులావ్ ను తయారుచేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. రుచి మాత్రమే కాదు, మన శరీరానికి కావల్సిన పోషకాలను అంధించి, శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

పాలక్ పులావ్ పేరు వింటనే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి. ఈ రుచికరమైన వంటను టమోటో మరియు ఉల్లిపాయ రైతా చాలా టేస్ట్ గా ఉంటుంది. పాలకూరలో మ్యాంగనీస్ మరియు కాపర్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు కాంపోనెంట్స్ బోన్ హెల్త్ ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతే కాదు, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందించే ఈ పాలక్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Palak Pulao Recipe: Healthy and Tasty

కావల్సిన పదార్థాలు:
పాలకూర: 2కట్టలు(సన్నగా తరిగినవి)
బియ్యం: 2cups(నానబెట్టినవి)
యాలకలు: 2
లవంగాలు: 2
దాల్చిన చెక్క: చిన్న ముక్క
మిరియాలు: 4
స్టార్ ఆనిస్: 1
బిర్యానీ ఆకు: 1
జీలకర్ర: 1tsp
టమోటో: 1 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగినవి)
పసుపు: 1/2tsp
ధనియాలపొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి.
2. తర్వాత అందులో బిర్యానీ ఆకు, జీలకర్ర, పచ్చిమిర్చి, యాలకలు, లవంగాలు, మిరియాలు, స్టార్ ఆనీస్ మరియు దాల్చిన చెక్క చిన్న ముక్క వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
3. ఒక నిముషం ఈ పోపుదినుసులు వేగిన తర్వాత అందులో పాలకూర తరుగును వేయాలి.
4. మంటను మీడియంగా పెట్టి ఆకుకూరలోని నీరు ఆవిరి అయ్యే వరకూ ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో టమోటో, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మరియు జీలకర్ర పొడి వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులో బియ్యం వేసి బాగా మిక్స్ చేసి మరో 3నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత అందులో 4కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. అంతే పాలక్ పులావ్ రిసిపి రెడీ.

English summary

Palak Pulao Recipe: Healthy and Tasty

There are so many different ways to prepare spinach rice. Some make puree of spinach and some add chopped spinach. Palak pulao, the name itself is mouth-watering. Treat yourself with this dish, using a generous serving of tomato-onion raita and or coconut chutney. Do you know that palak (spinach) has constituents like manganese and copper? These help in maintaining bone health.
Story first published: Wednesday, October 8, 2014, 12:05 [IST]
Desktop Bottom Promotion