For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్నీర్ బేబీ కార్న్ మసాల

|

పనీర్ లేదా కాటేజ్ చీజ్ ఒక ఆరోగ్యకరమైన డైరీ ప్రొడక్ట్. వెజిటేరియన్స్ పనీర్ అత్యంత హెల్తీ అండ్ న్యూట్రీషియన్ ఫుడ్ . ఈ డైరీ ప్రొడక్ట్ ను వివిధ రకాల వంటకాల్లో జోడించడంఅంటే వారికి అత్యంత ఇష్టం.

ముఖ్యంగా ఇండియన్ ఫెస్టివల్స్ కు పనీర్ ను ఎక్కువగా వండుకుంటుంటారు . మరి మీకు కూడాపనీర్ తో తయారుచేసే వంటలంటే ఇష్టమైతే , బేబీకార్న్ కాంబినేషన్ తో పనీర్ మసాలాను ఎలా తయారుచేస్తారో చూద్దాం. ఈ డిష్ స్పైసీగా...స్వీట్ గా పొట్టనింపుతుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

veg recipes in telugu

కావల్సిన పదార్థాలు:
పనీర్- 1 కప్ (క్యూబ్స్)
ఉల్లిపాయలు- 2 (తరిగిన)
టమోటోలు- 2 (తురిమిన) బేబీ 5-7 (ముక్కలుగా చేసి)
పచ్చిమిర్చి- 3-4 (ముక్కలుగా చేసి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1tbsp
ఎండుమిర్చి- 2
జీలకర్ర - 1tsp

READ MORE: బట్టర్ పనీర్: డెలిషియస్ రిసిపి
పసుపు - 1tsp
కారం: - ½tsp
ధనియాలపొడి- 1tsp
గరం మసాలా- 1tsp
నూనె-4tbsp

READ MORE:ఈజీ పన్నీర్ గులాబ్ జామూన్

తయారుచేయు విధానం:
1. ముందుగా పచ్చిమిర్చి, కారం, మరియు ఉల్లిపాయలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు జోడించి మరింత స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో జీలకర్ర వేసి, వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మీడియం మంట మీద కొన్నిసెకండ్లు వేగించి, తర్వాత మిక్సీ గ్రైండ్ చేసుకొన్న పేస్ట్ వేసి, ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులోనే టమోటోముక్కలు, ఉప్పు మరియు పసుపు వేయాలి. ఒక నిముషం వేగించుకోవాలి . తర్వాత అందులోనే ధనియాలపొడి, కారం, మరియు గరం మసాలా వేసి మీడియం మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా టమోటో కెచప్ వేయడం వల్ల కొద్దిగా స్వీట్ నెస్ వస్తుంది.

READ MORE: టమోటో పనీర్ పులావ్ రిసిపి
4. ఇప్పుడు అందులోనే పనీర్ ముక్కలు మరియు బేబీకార్న్ వేసి మిక్స్ చేస్తూ తక్కువ మంట మీద 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి . దాంతో పనీర్ ముక్కలు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి.
5. గ్రేవీ చిక్కబడిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి . అంతే చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి . అవసరం అయితే పన్నీర్ మరియు బేబీకార్న్ రెండూ కొద్దిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి...

English summary

Paneer Baby Corn Masala: Telugu Vantalu

Paneer Baby Corn Masala: Telugu Vantalu.Paneer or cottage cheese is one of the healthiest dairy products. For vegetarians, paneer is the most important ingredient. They love to add this dairy product in several dishes. Paneer is used to celebrate Indian festivals.
Story first published: Monday, September 14, 2015, 13:38 [IST]
Desktop Bottom Promotion