For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీకెండ్ స్పెషల్ పనీర్ బిర్యానీ : సింపుల్ అండ్ టేస్టీ

|

మనం ఇంట్లో సాధారణంగా వివిధ రకాల బిర్యానీలు ట్రై చేస్తుంటాము అలాంటి వాటిలో ఒక వెరైటీ బిర్యానీ రిసిపి పనీర్ బిర్యానీ రిసిపి. చికెన్ బిర్యానీ లాగే ఈ పనీర్ బిర్యానీ కూడా చాలా టేస్ట్ గా తయారుచేయవచ్చు.

పనీర్ బిర్యానీ తయారుచేయడానికి ముఖ్యంగా కావల్సింది ఫ్రెష్ గా ఫ్రోజోన్ సెక్షన్ లోని పనీర్ క్యూబ్స్ . అలాగే మీరు ఈ పనీర్ బిర్యానీ రిసిపికి ఏదైనా రెడీ మేడ్ గరం మసాలా లేదా బిర్యానీ మసాలా లేదా హోం మేడ్ గరం మసాలను ఉపయోగించవచ్చు. మరి ఈ వీకెండ్ లో మీరు కూడా పనీర్ బిర్యానీ రిసిపిని రుచి చూడాలంటే, ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

Paneer Biryani Recipe : Very Simple and Tasty

కావల్సిన పదార్థాలు :
ఉల్లిపాయలు: 3( సన్నగా ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
బాస్మతి రైస్ : 2cup
నూనె: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా

మ్యారినేషన్ కోసం
నెయ్యి (లేదా నూనె) : 2tbsp
పనీర్ : 1 ½ cup
పెరుగు: ½ cup
హోం మేడ్ బిర్యాని మసాలా పొడి: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
పసుపు: ¼ tsp
ఎర్ర కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయలు: 2tbsp
పుదీనా: కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి
కొత్తిమీర : కొద్దిగా (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చి మిర్చి: 1మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి
బే ఆకు: 1
యాలకలు: 4
బ్లాక్ ఏలకులు: 1
6 లవంగాలు: 6
దాల్చిన చెక్క : 1
జాపత్రి: 1
స్టార్ సొంపు: 1
షాహిజీర: ½ tsp
కేవార్ వాటర్ లేదా పన్నీర్: 1 tsp

గార్నిష్ కోసం
ఉల్లిపాయలు: వేయించినవి కొన్ని
క్యాప్సికమ్ : ముక్కలుగా కట్ చేసినవి లేదా కొన్ని జీడిపప్పు
పనీర్ ముక్కలు : కొన్ని
పుదీనా మరియు కొత్తమీర : కొద్దిగా

తయారుచేయు విధానం :
1. ముందుగా మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి, నూనె వేసి వేడి అయ్యాక, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సిక్ వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి . అలాగే పనీర్ ముక్కలు ఆ తర్వాత జీడిపప్పు ఒక దాని తర్వాత ఒకటి విడివిడిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మ్యారినేషన్ కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటి ఒక బౌల్లో వేసి పనీర్ కు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత నీటిలో ఒక చెంచా నూనె వేసి నీరు బాగా మరిగిన తర్వాత అందులో శుభ్రం చేసి పెట్టుకొన్న బియ్యం వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మందపాటి పాన్ ను స్టౌ మీద పెట్టి వేడయ్యాక అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న పనీర్ ను లేయర్ గా వేసి పాన్ మొత్తం సర్దాలి. తర్వత దానిమీద అదే లెవల్ కు రైస్ వేసి సర్దాలి. రైస్ మీద కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకొన్న ఉల్లిపాయలు, పుదీనా కొత్తిమీర చిలకరించాలి. ఇప్పుడు దీనికి మీద ఫ్రైడ్ ఆనియన్స్, క్యాప్సికమ్, కేవర లేదా రోజ్ వాటర్ వేసి చిలకరించాలి.
5. ఇలా మొత్తం రైస్, మ్యారినేట్ పనీర్ సర్దిన తర్వాత . ఆవిరి బయటపోకుండా మూత పెట్టాలి. లేదా అల్యూమినియమ్ ఫోయల్ తో సీల్ చేయాలి.
6. 5నిముషాలు ఎక్కువ మంట మీద ఉడకనిచ్చి, తర్వాత దానికి మీద వేడి తవాను ఉంచాలి. దీన్ని 10 నుండి 12నిముషాలు ఆవిరి మీద ఉడికించాలి.
7. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి మరో 15నిముషాలు అలాగే ఉంచాలి.
8. 15నిముషాల తర్వాత మూత తీసి, ఫ్రై చేసుకొన్న జీడిపప్పు, పనీర్, పుదీనా మరియు ఉల్లిపయ ముక్కలు గార్నిష్ గా అలంకరించి, రైతాతో సర్వ్ చేయాలి.

English summary

Paneer Biryani Recipe : Very Simple and Tasty

This Indian rice recipe is special because it is prepared by layering. The paneer biryani recipe that we are sharing right now can even be prepared at home.
Story first published: Saturday, April 4, 2015, 15:04 [IST]
Desktop Bottom Promotion