For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ పనీర్ కార్న్ కుర్మా రిసిపి (వీడియో)

|

సాధారణంగా చాలా మంది పిల్లలు వైరీటీగా ఏదైనా తినాలని కోరుకుంటారు. అయితే వారికి రుచికరమైన వంటలతోపాటు, ఆరోగ్యకరమైన పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లల కోసం తయారుచేసే వంటలు పూర్తి పోషకాంశాలతో నిండినవై ఉండాలి . ఇది పిల్లల పెరుగుదలకు చాలా అవసరం.

పిల్లలకు ఇష్టమైన ఆహారాల్లో అటువంటి స్పెషల్ వంట ఈరోజు మీకు అందిస్తున్నాం. ఈ టేస్టీ వెజిటేరియన్ రిసిపి పనీర్ కార్న్ కుర్మా పూర్తి పోషకాలు కలిగినటువంటి ప్రోటిన్ రిచ్ ఫుడ్. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. పనీర్, కార్న్ ఈ రెండు కాంబినేషన్ తో తయారుచేసి ఈ రిసిపి పిల్లలకు చాలా ఇష్టమైన ఆహారం. కాబట్టి, ఈ కార్న్ పనీర్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Paneer Corn Korma Recipe: Watch Video & Learn

కావల్సిన పదార్థాలు:

పనీర్: ¾ cup(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
తీపి మొక్కజొన్నవిత్తులు(స్వీట్ కార్న్ కెర్నలు): ¼cup
ఉల్లిపాయ: ½cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమోటో: 1cup(చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
పసుపు: ¼tsp
కారం: 1 ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
టమోటో గుజ్జు: 1tbsp
పెరుగు: ½cup(చిలికినది)
నూనె: 5tsp
కొత్తిమీర: కొద్దిగా
కొబ్బరి పేస్ట్ కోసం కావల్సినవి:
కొబ్బరి తురుము: ¼cup
గసగసాలు: 2tsp
జీడిపప్పు: 8
పచ్చిమిర్చి: 1tbsp (సన్నగా తరిగినవి)

తయారుచేయు విధానం:

1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి, అందులో కొబ్బరి తురుము వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
2. అలాగే అందులోనే గసగసాలు, జీడిపప్పు వేసి మరో 2-3నిముషాలు మీడియం మంట మీద ప్రై చేసుకోవాలి.
3. ఫ్రై చేసుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి, పది నిముషాలు చల్లారనివ్వాలి.
4. తర్వాత వీటిలో పచ్చిమిర్చి వేసి మిక్సీలో ఫ్రై చేసిన కొబ్బరి, జీడిపప్పు, పచ్చిమిర్చి , కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. తర్వాత అదే ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో రెండు టీస్పూన్ నూనె వేసి, అందులో పన్నీర్ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ లో వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
6. తర్వాత ప్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. ఒక సారి వేగి తర్వాత వీటిని చల్లారినివ్వాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
7. ఇప్పుడు డీప్ ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లిపేస్ట్ కొబ్బరి పేస్ట్ వేసి కొద్ది సమయం ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకొన్న టమోటో ముక్కలు కూడా వేసి వేగించాలి.
8. మీడియం మంట మీద కొద్దిసేపు వేగిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేయాలి.
9. ఒక నిముషం వేగిన తర్వాత అందులో 1/4కప్పు నీళ్ళు పోసి రెండు నిముషాలు ఉడికించుకోవాలి.
10. రెండు నిముషాల తర్వాత పొటాటో మాషర్ తో టమోటోను బాగా మాష్ చేయాలి. చేసిన తర్వాత అందులో పెరుగు, టమోటో గుజ్జువేసి బాగా మిక్స్ చేసి 2నిముషాలు ఉడికించుకోవాలి.
11. తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న కార్న్ మరియు ఫ్రై చేసుకొన్న పనీర్ ముక్కలు వేసి మరో రెండు మూడు నిముషాలు ఉడికించికోవాలి.
12. పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే పనీర్ కార్న్ కుర్మా రెడీ . ఈ రుచికరమైన డిష్ ను రోటీ రైస్ కు మంచి కాంబినేషన్.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/YPWE28ZYRzo?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary

Paneer Corn Korma Recipe: Watch Video & Learn

Kids are always the fussy eaters in the family. Mothers have to be extremely careful about choosing the right ingredients for making their kids eat healthy. Apart from making the dish tasty, you have to make sure that the dish has all the important nutrients in it which is essential for your kid's growth.
Story first published: Friday, April 25, 2014, 13:17 [IST]
Desktop Bottom Promotion