For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనీర్ పోస్తో: రుచికరమైన బెంగాళి రిసిపి

|

పనీర్ పాస్టో వెరీ సింపుల్ రిసిపి, ఈ వంట బెంగాల్ స్పెషల్ వంట. ఈ వంటకు చాలా తక్కువ పదార్థాలు మాత్రమే అవసరం అవుతాయి. మీరు ఏదైనా కొత్త వంటను రుచి చూడాలన్నప్పుడు, ఇటువంటి సింపుల్ రిసిపిలను ఎంపిక చేసుకోవచ్చు.

ఈ బెంగాలీ స్పెషల్ రిసిపి చాలా త్వరగా తయారుచేయవచ్చు. మరియు రుచికరమైన వంట రైస్, చపాతీలకు చాలా మంచి కాంబినేషన్. ఈ వంటకు ప్రధాన రుచి గసగసాలా పేస్ట్, మరియు జీడిపప్పు పేస్ట్. అందుకే పనీర్ పాస్టో అని ఈ వంటకు పేరు. మరి ఈ టేస్టీ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Yummy Bengali Recipe

పన్నీర్: 250gms
పొస్తో పేస్ట్: 5-6tbps
పచ్చిమిర్చి: 3-4
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: 1/4tsp
జీడిపప్పు: 8-10
కస్తూరి మెంతి: 1/2tbsp
క్రీమ్ : 1cup
పాలు : 1/2cup
బట్టర్ం 50gms

తయారుచేయు విధానం:
1. ముందుగా గసగసాలను మరియు జీరిపప్పును నీటిలో ఒకటి లేదా రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. పచ్చిమిర్చి, పాస్టో(గసగసాలు), మరియు కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. అలాగే జీడిపప్పు కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. పనీర్ ముక్కగా కట్ చేసుకొని, మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి.
5. తర్వాత స్టౌమీద డీప్ ఫ్రైయిం్గ పాన్ పెట్టి, అందులో బటర్ వేసి వేడి చేయాలి.
6. ఇప్పుడు అందులో పాస్తో పేస్టే వేసి బాగా మిక్స్ చేస్తూ, వేయించుకోవాలి.
7. ఇప్పుడు అందులో ఉప్పు వేసి మిక్స్ చేయాలి.
8. ఇప్పుడు అందులో కొద్దిగా పాలు వేసి మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. లేదంటే, పూర్తిగా డ్రై అవుతుంది.
9. తర్వాత అందులో జీడిపప్పు పేస్ట్ , క్రీమ్ మరియు షుగర్ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి. కొన్ని నిముషాలు వేయించుకోవాలి.
10. మూత పెట్టి, అతి తక్కువ మంట మీద మరో 5నిముషాలు వేగించుకోవాలి.
11. తర్వాత మూత తీసి మరికొంత బటర్ మరియు మెంతి ఆకులు వేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి. ఈ స్పెషల్ డిష్ రైస్ మరియు చపాతీలకు మంచి కాంబినేషన్.

English summary

Paneer Posto: Yummy Bengali Recipe

Paneer posto is a very simple yet savoury Bengali recipe with the requirement of a very few ingredients. If you are not in a mood for much elaborate cooking then this is one thing that you can go for and yet gain appreciation. Any Bengali family simply loves to include a dish of posto in their recipe list.
Desktop Bottom Promotion