For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాస్తా విత్ మష్రమ్ సాస్ రిసిపి-వరల్డ్ పాస్తా డే స్పెషల్

|

పాస్తాను ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన డైట్ కోసం పాస్తాను ఎంపిక చేసుకోవడం ఒక ఫర్ ఫెక్ట్ చాయిస్. ఫుడ్ లవర్స్ కు దీన్ని ఎంపిక చేసుకోవడం, తయారుచేడం అద్భుతమైన రుచిని ఆస్వాధించడం చాలా సులభం. మీరు రోటీ-సబ్జీ మరియు అన్నం-పప్పు వంటి కాబినేషన్స్ తో విసుగు చెందిఉంటే, కొంచెం డిఫరెంట్ గా వంటలను తయారుచేసే సమయం ఇప్పుడు మీ చేతిలో ఉంది . కొత్త వంటలను తయారుచేయడానికి కొంత ఉత్సాహం, ప్రయోగం, వల్ల మీ టేస్ట్ బడ్స్ కు మరో కొత్త రుచిని అంధించవచ్చు.

ఈ రోజు ప్రపంచ ‘పాస్తా' దినోత్సవం. ప్రపంచ ‘పాస్తా' రోజును ప్రతి సంవత్సరం అక్టోబర్ 25న జరుపుకొంటారు. ఈ రోజు చాలా దేశాల్లో ఈ పాస్తా డే ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఇటాలియన్ రుచులను ఆరగిస్తారు. పాస్తాలో ఉన్న న్యూట్రిషయన్స్ చాలా అరోగ్యకరం కాబట్టి ఈ ఇటాలియన్ ఫుడ్ ను ఇతర దేశాల్లో అందురూ చాలా అమితంగా ఇష్టపడుతారు. ఈ ఇటాలియన్ డిషెస్ చాలా ప్రసిద్ది చెందినవి. రాను రాను మన దేశంలోని ప్రజలు కూడా ఈ ఇటాలియన్ రుచులకు అలవాటు పడుతున్నారు.

Pasta With Mushroom Sauce-World Pasta Day Spcl

రోజు బీరకాయ, పప్పు, క్యాబేజీ, సొరకాయ, వగైరా వగైరా కూరల వండి విసుగు వచ్చేసింది.. తినిని బోరుకొడుతుంటే కనుక ఈ వెరైటీ పాస్తా తయారు చేసి తింటే చాలా రుచికగా వుంటుంది. ప్రాసెస్ కొంచం చిన్నదే అయినా నూడిల్స్ తో పోలుచుకుంటే కొంచం టైం ఎక్కువ పడుతుంది.. కాకపోతే నూడిల్స్ తో పోలిస్తే రుచి బావుంటుంది, ఆరోగ్యకరం కూడా. పాస్తా ఇప్పుడు అన్ని షాప్స్ లో దొరుకుతున్నాయి.. రెడీమేడ్ గా వస్తున్న పాస్తా కంటే విడిగా వున్నా గోధుమ, రైస్ తో చేసిన పాస్తానే తీసుకోండి. మైదాతో చేసిన దానిని తీసుకోవద్దు. మరీ పాస్తా వంటకాల్లో చాలా రకాలే ఉన్నాయి. అయితే వాటిలో చాలా సులభంగా టేస్టీగా తయారుచేసుకొనే పాస్తా విత్ మష్రూమ్ సాస్ మీకోసం...

కావల్సిన పదార్థాలు:
పాస్తాకోసం:
పెన్నీ పాస్తా: 250grm
ఉప్పు: చిటికెడు
నూనె: 1tsp
మష్రూమ్ సాస్ కోసం:
మష్రూమ్: 1/2cup(కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 3-4(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
చిక్కటి వైట్ సాస్: 1cup
ఒరిగానో: 1tsp(ఎండినది)
ప్రొసెస్డ్ చీజ్: 2tbsp(తురుము కోవాలి)
ఇటాలియన్ సాస్: 1/2tsp
బట్టర్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నీళ్ళు పోసి, మూత పెట్టి బాగా కాగించాలి.
2. నీళ్ళు మరుగుతున్నప్పుడు మూత తీసి అందులో పాస్తా, కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా నూనె వేసి బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాల. తర్వాత పాస్తా కాస్త మెత్తగా ఉడికిన తర్వాత నీరు వంపేసి పక్కకు తీసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి చేసిన తర్వాత అందులోనే బట్టర్ కూడా వేసి వేడి చేయాలి, బట్టర్ కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి.
4. రెండు, మూడు నిముషాలు ఉల్లిపాయ ముక్కలను వేగించుకొన్న తర్వాత అందులో పచ్చిమిర్చి మరియు కట్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చి ముక్కలు వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి .
6.. మష్రుమ్ కొద్దిగా మెత్తగా అయిన తర్వాత అందులో అరకప్పు నీళ్ళు పోసి, ఉడికించాలి.
7. 5నిముషాలు ఉడికిన తర్వాత అందులో వైట్ సాస్, ఇటాలియన్ సాస్, ఓరిగానో మరియు చీజ్ వేసి బాగా మిక్స్ చేయాలి.
8. చివరగా కొద్దిగా ఉప్పును చిలకరించి, తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకొన్న పాస్తాను అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే తినడానికి పాస్తా విత్ మష్రూమ్ సాస్ రెడీ. వేడి వేడిగా తింటే చాలా రుచికరంగా ఉంటుంది.

English summary

Pasta With Mushroom Sauce-World Pasta Day Spcl


 Pasta is the perfect choice for a tasty, healthy diet. It is easy to prepare and can be a delicious treat for foodies. If you are bored of the same roti and sabji or rice and dal, then you must try your hands in some other cuisines at times.
Story first published: Friday, October 25, 2013, 11:10 [IST]
Desktop Bottom Promotion