For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైనాపిల్ రైస్- సౌత్ ఇండియన్ రిసిపి

|

ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. అందులో అనాస పండు ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. దీనిలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. ప్రయోజనాలతో నిండిన పైనాపిన్ కి ఇక పై నో చెప్పకండి. తాజా పండ్ల రూపంలోనే కాకుండా స్క్వాష్‌లు, జామ్‌లు, సిరప్‌లు, కార్డియల్స్ రూపంలో దీనిని మార్కెట్ చేస్తున్నారు. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి.

అనాసలోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో 'సి' విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి. మరి ఇన్ని సుగుణాలున్న పైనాపిల్ తో రైస్ వండితే ఎలా ఉంటుందో రుచి చూడాలంటే..తయారుచేయు విధానం తెలుసుకోవాల్సిందే...

Pineapple Rice- South Indian Recipe

కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups
పైనాపిల్ ముక్కలు: 1cup
అల్లం: కొద్దిగా(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
జీడిపప్పు: 8-10
కిస్‌మిస్: 5-6. కారం: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
ఉల్లికాడల తరుగు: 2t bsp
రిఫైన్డ్ ఆయిల్: సరిపడా
పండుమిర్చి తరుగు: 1tsp
వెల్లుల్లి తరుగు: 1/2cup
బీన్స్ తరుగు: 1/2cup
పసుపు: చిటికెడు
మిరియాల పొడి: 1tsp
నిమ్మరసం : 1tsp

పైనాపిల్ ఆకారం..రంగు వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు..!

తయారు చేయు విధానం:
1. బియ్యంలో నీళ్లు పోసి పలుకుగా ఉడికించాలి. చల్లారిన తర్వాత కొద్దిగా నూనె వేసి, అన్నం ఆరబెట్టాలి.
2. తర్వాత స్టౌమీద పాన్ పెట్టి, పోపుకు తగినంత నూనె వేసి, వేడి చేయాలి.
3. ఇప్పుడు అందులో వెల్లుల్లి తరుగు, పండుమిర్చి తరుగు, బీన్స్, క్యారట్ తరుగు వేసి కలపాలి. పోపుగింజలు, ఉప్పు, కూరగాయ ముక్కలు, కారం, అన్నం, పసుపు, పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలిపి, ప్లేట్‌లోకి తీసుకోవాలి.

పైనాపిల్ తో ఆహా అనిపించే చర్మం సౌందర్యం మీ సొంతం...
4. చివరగా వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, ఉల్లికాడలతో, కొద్దిగా పెప్పర్ పౌడర్, నిమ్మరసంతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. అంతే పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ. సూచన: మాంసాహారం ఇష్టపడేవారు ఉడికించిన బోన్‌లెస్ చికెన్ ముక్కలు లేదా గుడ్డును కూడా వాడుకోవచ్చు.

English summary

Pineapple Rice- South Indian Recipe

Pineapple Rice- South Indian Recipe,Pineapple as we know is a citrus food that has abundance of vitamin C. Many of us like the fruit as it has a distinct taste. We all know that pineapple is used for the preparation of cakes, ice creams and salads.
Story first published: Monday, February 22, 2016, 17:29 [IST]
Desktop Bottom Promotion