For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెజర్ కుక్క్డ్ వెజిటేబుల్ కర్రీ రిసిపి : సౌంత్ ఇండియన్ స్పెషల్

|

గ్రీన్ వెజిటేబుల్స్ పుష్కలంగా దొరికే సీజన్ వింటర్. మార్కెట్లో, చిన్న చిన్నకూరగాయల అంగడిలో మొత్తం గ్రీన్ గ్రీన్ గా వెజిటేబుల్స్ కనబడుతుంటాయి. కాబట్టి, సీజనల్ గా దొరికే వివిధ రకాల కూరగాయాలను మర రెగ్యులర్ డైట్ లో పూర్తిగా చేర్చుకోవాలి. అప్పుడే మన శరీరానికి చేరాల్సి పోషకాశాలన్నీ అందుతాయి. ఒక్కో రకమైన కూరగాలతో వంట వండటం ఒక రుచి అయితే, మూడు, నాలుగు రకాల తాజా కూరగాయలు, వాటికి కొద్దిగా కూరాకు కూడా మిక్స్ చేస్తే చాలా అద్భుతమై రుచి ఉంటుంది.

మన ఇండియన్ స్టైల్ వంటే అయినే, సౌంత్ మరియు నార్త్ రిసిపిలు చాలా వెరైటీగా వేటికవే రుచిని కలిగి ఉంటాయి. సౌత్ వారికి నార్త్ వంటలు నచ్చితే, నార్త్ వారి సౌత్ వంటలు నచ్చుతాయి. మరి నార్త్ సైడ్ వంటల్లో ఒక అద్భుతమైన రుచికలిగిన సాధారణ వంట మిక్డ్స్ వెజిటేబుల్ కర్రీ. ఇది చాలా పాపులర్ రిసిపి. దీన్ని తయారుచేయడం చాలా సులభం, మరియు చాలా తేలిక. కుక్కర్లో తయారుచేస్తే మరింత ఈజీ మరియు త్వరగా రెడీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ డెలిషియస్ వెజిటేబుల్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Pressure Cooked Vegetable Curry Recipe

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 2(తొక్క తీసి, శుభ్రం చేసి, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు- 2-3 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
గ్రీన్ బీన్స్- 4-5 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో- 1 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఆకుకూరలు- 50gms (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
గ్రీన్ పీస్(పచ్చిబఠానీలు- 2tbsp
పచ్చిమిర్చి- 2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం- 1 inch (తురుమిపెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు- 3-4(పేస్ట్ చేసుకోవాలి)
పసుపు- 1tsp
కారం- 1½ tsp
ధనియాలపొడి- 2tsp
గరం మసాలా- ½tsp
జీలకర్ర మరియు ఆవాలు- ½tsp
నిమ్మరసం- ½tsp
కొత్తిమీర- 2tbsp (chopped)
ఉప్పు- రుచికి సరిపడా
నూనె- 2tbsp
నీళ్ళు- 1 ½ cups

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి.
2. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద వేగించుకోవాలి. తర్వాత అందులో బంగాళదుంపల ముక్కలు వేసి మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే పసుపు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి వేసి వేగించుకోవాలి. తర్వాత బీన్స్, పచ్చిబఠానీలు, మరియు టమోటో ముక్కలు కూడా వేసి మరో నిముషం మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో ధనియాలపొడి, కారం వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. తర్వాత అందులో నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
5. రెండు విజిల్స్ వచ్చిన 10 నిముషాల తర్వాత మూత తీసి అందులో గరం మసాలా, నిమ్మరసం, మరియు కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేయాలి . అంతే ప్రెజర్ కుక్కర్ వెజిటేబుల్ కర్రీ రెడీ . ఈ ఇండియన్ సైడ్ డిష్ ను స్పెషల్ గా రోటీలతో సర్వ్ చేయాలి.

English summary

Pressure Cooked Vegetable Curry Recipe: Telugu Vantalu

We all are advised to include vegetables in our diet. However, we do not like to have green vegetables every day. This is where your cooking techniques and creativity comes to place. You can prepare delicious and lip smacking recipes using vegetables.
Story first published: Monday, August 3, 2015, 14:54 [IST]
Desktop Bottom Promotion