For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రోటీన్ రిచ్ తూర్ దాల్ రైస్ రిసిపి

|

వంట వండటానికి సమయం, ఓపిక రెండూ లేనప్పుడు, ఒక ఆరోగ్యకరమైన ప్రోటీన్ రిచ్ ఫుడ్ ను చిటికెలో తయారుచేసుకోవాలనుకుంటే, తూర్ దాల్ రైస్ రిసిపి ఒక బెస్ట్ ఆప్షన్ . ఎందుకంటే, కొన్ని పోపుదినుసులు, టమోటో, ఉల్లిపాయల మరియు తూర్ దాల్, రైస్ ను ఫ్రై చేసి కుక్కర్ లో వేసి 4 విజిల్స్ తో 10నిముషాలలోపు హెల్తీ ఫుడ్ మీ ముందు ఉంటుంది.

ఇలాంటి హెల్తీ ఫుడ్ తయారు చేయడం కష్ట కాదు, మరియు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పొట్ట నింపుతుంది. చాలా టేస్టీగా ఉండే తూర్ దాల్ రైస్ రిసిపికి కొద్దిగా నెయ్యి, మరియు మీకు ఇష్టమైన కర్రీతో తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది . తూర్ దాల్ రైస్ లో ఫోలిక్ యాసిడ్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మహిళకు చాలా ఉపయోగకరమైనర డిష్ . ఈ దాల్ రిసిపిలో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని తయారుచేయడం చాలా సులభం. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Protein Rich Toor Dal Rice Recipe

కావల్సిన పదార్థాలు:
రైస్: 1cup
కందిపప్పు: 1/4cup
జీలకర్ర: 1tsp
ఆవాలు: 1tsp
పసుపు: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఇంగువ: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయ: 1tbsp
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమోటో: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
నూనె: 1tbsp
నీళ్ళు : 1/2cup

తయారుచేయు విధానం:
1. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి, వేడిఅయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేసి వేగనివ్వాలి.
2. ఒక నిముషం తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటో వేసి మీడియం మంట మీద మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
3. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత అందులో పసుపు, ఇంగువ మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేయాలి.
4. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకొన్న బియ్యం, మరియు కందిపప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ, ఫ్రై చేసుకోవాలి.
5. ఒక రెండు మూడు నిముషాల తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి, మూత పెట్టి, నాగులు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకొని, స్టౌ ఆఫ్ చేయాలి.
అంతే తూర్ దాల్ రైస్ రిసిపి రెడీ. కందిపప్పు రైస్ లో ఫోలిక్ యాసిడ్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటుంది. ఈ దాల్ లో అధిక ఫౌబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది మలబద్దక సమస్యలను నివారిస్తుంది.

English summary

Protein Rich Toor Dal Rice Recipe

At times it is nice to sit back and relax with something simple on your plate. This afternoon, Boldsky shares with you a simple dal rice recipe which will suit the needs of everyone in your family. This dal recipe is made with the help of toor dal which is one of the best ingredients to add to your diet.
Story first published: Monday, March 2, 2015, 12:58 [IST]
Desktop Bottom Promotion