For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాజ్మా మసాలా రిసిపి: పంజాబీ స్టైల్

|

రాజ్మాలో రెండు రకాలు మనకు మార్కెట్లో లభ్యం అవుతాయి. ఒకటి తెల్లగా ఉండే రాజ్మా(కిడ్నీ బీన్స్)పంజాబ్ లో ఎక్కువగా పండిస్తారు. ఇక రెండవది రెడ్ రాజ్మా వీటిని కాశ్మిర్ లో ఎక్కువగా పండిస్తారు. అందుకే ఈ రెడ్ రాజ్మాను కాశ్మిర్ రాజ్మా మసాలా తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
ఇండియన్ కుషన్స్ లో రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ చాలా పాపులరైనటువంటి సైడ్ డిష్. ముఖ్యంగా రాజ్మా వంటలను నార్త్ స్టేట్స్ లో ఎక్కువుగా తయారుచేస్తారు. వీటిని బీన్స్ గా పిలుచుకొనే సౌత్ స్టేట్స్ లో కూడా వీటిని ఎక్కువగా వండుతారు. రాజ్మా పొట్టనిండినట్టు చేస్తే ఒక రిచ్ ఫుడ్ . వీటిని ఎక్కువగా రాత్రుల్లో డిన్నర్ కు ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. అలాగే రోజంతా హెల్తీగా ఉండేందుకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కూడా తీసుకుంటారు. మరీ ఈ రాజ్మాను హెల్తీ డిన్నర్ రిసిగా ఎలా తయారుచేయాలో చూద్దాం...

Punjabi Style Rajma Recipe

కావల్సిన పదార్థాలు:
రెడ్ రాజ్మా: 1cup(రాత్రంతా నానబెట్టాలి)
ఉల్లిపాయలు: 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్: 1tsp
టమోటాలు :3 (గుజ్జు చేసుకోవాలి)
కారం పొడి: 1tsp
ధనియాల పొడి : 1 tsp
పసుపు పొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
గరం మసాలా: 1tsp
బిర్యానీ ఆకు : 1
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా రాత్రంతా నానబెట్టుకొన్న రాజ్మాను శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసి, సరిపడా నీళ్ళు పోసి 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. అంతలోపు, స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి, వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, వేసి ఒక నిముషం వేగనివ్వాలి.
3. తర్వాత ఉల్లిపాయలు, అల్లం, వెల్లులి పేస్ట్ కూడా వేసి మీడియం మంట మీద వేగించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించాలి.
4. తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి, మరియు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి.
5. మసాలా వేగుతుండగానే అందులో టమోటో గుజ్జు కూడా వేసి, మిక్స్ చేస్తూ వేగించుకవాలి. తర్వాత అందులో ఉప్పు కూడా వేసి 2నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత ఉడికించుకొన్న రాజ్మా, నీళ్ళతో సహాయ అందులో పోయాలి. గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించాలి. రాజ్మా మసాలా చిక్కగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
7. చివరగా పంజాబీ స్టైల్ రాజ్ మసాలాను కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి చపాతీ లేదా రైస్ తో సర్వ్ చేయాలి. అంతే రాజ్మా మసాల రెడీ.

English summary

Punjabi Style Rajma Recipe


 There are many ways to prepare the authentic and delicious North-Indian, rajma. However, the best and traditional way to prepare rajma is always a sumptuous treat. The thick gravy pis prepared using the kidney beans and lots of spices are used to make it taste better.
Story first published: Monday, October 20, 2014, 18:17 [IST]
Desktop Bottom Promotion