For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీగా..కూల్ గా కర్డ్ రైస్

|

ఇండియన్ వంటకాల్లో పెరుగన్నం చాలా స్పెషల్ సైడ్ డిష్. సౌత్ సైడ్ వెళ్ళినట్లైతే ప్రతి భోజనానికి పెరుగన్నాన్ని చూడవచ్చు . ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరియు కడుపును చల్లగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడుతుంది . అంతే కాదు కడుపు నిండేలా చేస్తుంది.

పెరుగన్నాన్ని తయారు చేయడానికి చాలా పద్దతులున్నాయి, అందులో చాలా సింపుల్ గా మరియు అతి సాధారణంగా ఎక్కువగా తయారు చేసే కర్డ్ రైస్ అన్నం, పెరుగు, జీలకర్ర, తయారు చేస్తారు. అయితే ఇందులో మీకు ఇష్టమైన వెజిటేబుల్స లేదా పండ్లు కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. మరి మీకు ఇష్టమైన దానిమ్మ గింజలను ఉపయోగించి పెరుగు అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం.

Quick Curd Rice In Five Simple Steps

కావల్సిన పదార్థాలు:
పెరుగు: 2cups
బియ్యం: 1/2kg
పచ్చిమిర్చి: 4-6
ఉల్లిపాయలు: 1-3
అల్లం: చిన్నముక్క
దానిమ్మగింజలు: 1cup
ఆవాలు: 2tsp
జీలకర్ర: 2tsp
శెనగపప్పు: 3tsp
మినపప్పు: 2tsp
జీడిపప్పు: 8-10
ఎండు మిర్చి: 2-4
కరివేపాకు: మూడు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: ఒక కట్ట

తయారు చేయు విధాన:
1. మొదటగా అన్నం మెత్తగా వండి పక్కన తీసి పెట్టుకోవాలి. పెరుగు పులుపు రాకుండా రెడీ చేసుకోవాలి.
2. ఇప్పుడు వండుకున్న అన్నాన్ని బాగా చల్లారబెట్టాలి. ఇప్పుడు ఈ అన్నంలో అప్పుడే తోడుకున్న పెరుగుని వేసి బాగా కలపాలి.
3. ఇప్పుడు ఈ పెరుగు అన్నంలో తగినంత ఉప్పు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, దానిమ్మ గింజలు వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి అందులో ముందుగా నూనె వేసి కాగిన తర్వాత అందులో సెనగపప్పు, మినపప్పు, జీడిపప్పు వేసి అవి దోరగా వేగిన తరువాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి చివరిగా కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
5. అవి బాగా వేగిన తరువాత దించి పక్కన పెట్టి చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అన్నంలో వేయించి పెట్టుకున్న తాలింపును నూనె రాకుండా జాగ్రతగా వేయాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కలిసేలా పెరుగు అన్నాన్ని బాగా కలపాలి.
6. ఇప్పుడు ఈ పెరుగు అన్నంకు తరిగిన కొత్తిమీర తో పైన గార్నిష్ చేస్తే కర్డ్ రైస్ రెడీ..దీన్ని కొంత సేపు ఫ్ర్రిజ్జ్ లో పెడితే చల్ల చల్లగా చాలా బావుంటుంది.

English summary

Quick Curd Rice In Five Simple Steps

Planning to switch to a healthier version for lunch today. This simple and quick to prepare curd rice recipe is the one you can smoothly opt for. With all the ingredients at an easy access in the kitchen, this is a sure shot recipe to lay your hands on.
Story first published: Thursday, January 1, 2015, 14:32 [IST]
Desktop Bottom Promotion