For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముల్లంగి సాగ్ రిసిపి : స్పెషల్ సైడ్ డిష్

|

ముల్లంగి ఎక్కువ పోషకాలున్న వెజిటేబుల్. చాలా మందికి ముల్లంగి ఆకులు ఆరోగ్యకరమైనది గ్రహించరు . ఇందులో కూడా ఎక్కువ పోషకాలుంటాయి. ఎక్కువ పోషకాలుండుట వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను క్రమబద్దంలో ఉంచుతుంది . ఇది బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది మరియు ఇది లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందువల్ల ముల్లంగి సాగ్ రిసిపిని మీ రెగ్యులర్ డైట్ లో తప్పక చేర్చుకోవాలి.

ఈ సీజన్ లో ముల్లంగి మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉంది. తాజా ముల్లంగి వాటితో పాటు, ముల్లంగి ఆకు కూడా చేర్చి సాగ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. రుచి మాత్రమే కాదు, వివిధ రకాలుగా ఆరోగ్యానికి సహాయపడుతుంది. మరి ఈ స్పెషల్ ములీకా సాగ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Quick & Easy Mooli Ka Saag Recipe
Quick & Easy Mooli Ka Saag Recipe
Quick & Easy Mooli Ka Saag Recipe

కావల్సిన పదార్థాలు:
ముల్లంగి: 3-4(ఆకులతో సహా సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
ఆవాలు: 1/2tsp
జీలకర్ర: 1/2tsp
ఇంగువ: చిటికెడు
పసుపు: 1/2tsp
కారం: 1tsp
పంచదార: 1tsp
డ్రై మ్యాంగో పౌడర్: 1tsp
నూనె: 1tbsp

Quick & Easy Mooli Ka Saag Recipe
Quick & Easy Mooli Ka Saag Recipe

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆకలుతో ఉన్న ముల్లంగిని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్లో ఒక చెంచా ఉప్పు, ముల్లంగి ఆకులతో సహా కట్ చేసుకొన్న ముక్కలను వేసి చేతితో బాగా మిక్స్ చేయడం వల్ల నీరు బయటు వచ్చేస్తుంది . ఇలా చేయడం వల్ల చేదు తొలగిపోతుంది.
3. ఈ బౌల్ ను 20 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ముల్లంగి నుండి వచ్చిన నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, మరియు ఇంగువ వేసి వేగించాలి.
5. తర్వాత పసుపు మరిు కారం కూడా వేసి మరో సెకన్ వేగించుకోవాలి.
6. తర్వాత ముల్లంగి ముక్కలు, ఆకుతో సహా వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి .
7. వేగిన తర్వాత అరకప్పు నీళ్ళు పోసి మిక్స్ చేసి మంటను సిమ్ లో పెట్టాలి. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేస్తూ మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.
9. దాని తర్వాత మూత తీసి, కొద్దిగా ఉప్పు వేసి , అందులో పంచదార, డ్రై మ్యాంగో పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే మూలి కా సాగ్ రిసిపి రెడీ. ఈ స్పెషల్ వెజిటేరియన్ రిసిపిని పరోఠా లేదా సైడ్ డిష్ దాల్ అండ్ రైస్ తో పాటు తీసుకోవచ్చు.

Quick & Easy Mooli Ka Saag Recipe
Quick & Easy Mooli Ka Saag Recipe

English summary

Quick & Easy Mooli Ka Saag Recipe

Mooli or radish is an extremely nutritious vegetable. Many of us are not aware that apart from the radish, its leaves, which we usually discard, is also a very nutritious part. Mooli ka saag helps in keeping cholesterol in check. It reduces blood pressure and is excellent for your liver. Therefore, you must make it a point to include mooli ka saag in your everyday diet.
Story first published: Wednesday, January 7, 2015, 18:19 [IST]
Desktop Bottom Promotion