For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముల్లంగి సాంబార్: రైస్ కు బెస్ట్ కాంబినేషన్

|

ముల్లంగి...ముఖ్యంగా సౌత్ ఇండియాలో దీని వాడకం ఎక్కువ. సాంబార్, చట్నీ ఇలా వివిధ రకాలుగా వండుకుని తింటారు. ఇది మంచి రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలను ఎక్కువగా కలిగిస్తుంది.

సాంబార్ సౌత్ ఇండియన్ స్పెషల్ వెజిటేరియన్ రిసిపి. సౌత్ ఇండియాలో ఈ సాంబార్ రిసిపిని ఒక్కో స్టేట్ లో ఒక్కో రకంగా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. రుచికి కూడా వేటికవే సాటి. ఈ క్లాసిక్ డిష్ ను పప్పు, తాజా వెజిటేబుల్స్ ఉపయోగించి తయారుచేస్తారు. సాంబార్ అంటే కొత్తగా చెప్పేదేముంది అంటారా?? పప్పుచారుకు, సాంబార్ కు గల తేడా ఏంటంటే... కందిపప్పు ఉడికించి, చింతపండు పులుసు, కూరగాయలు వగైరా వేసి మరిగిస్తాం. కాని సాంబార్ అంటే ప్రత్యేకంగా చేసుకున్న సాంబార్ పొడి వేయాలి. దీనివల్ల కొత్త రుచి వస్తుంది.చాలా సులభంగా తయారుచేవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి..

Radish Sambar Best Combination for Rice

కావల్సిన పదార్థాలు:
కందిపప్పు: 1cup
పచ్చిమిర్చి : 2-3 మద్యకు కట్ చేసుకోవాలి
టమోటోలు: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ముల్లంగి: 1cup(పల్చగా గుండ్రంగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 4-5
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: 1/2tsp
సాంబార్ పౌడర్: 2tsp
కొత్తిమీర తరుగు: కొద్దిగా
నూనె: సరిపడా
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
ఎండు మిర్చి : 1
కరివేపాకు: రెండు రెమ్మలు:
చింతపులుసి కొద్దిగా
ఇంగువ: చిటికెడు

తయారుచేయు విధానం :
1. ముందుగా పప్పును శుభ్రంగా కడిగి ప్రెజర్ కుక్కర్ లో వేసి 2కప్పులు నీళ్ళు పోసి 3 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకోవాలి.
2. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో చింతపండును 10నిముషాలు నానబెట్టి, గుజ్జును వేరుచేసుకోవాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత చిటికెడు ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించుకోవాలి.
4. ఒక నిముషం వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ముక్కులు, ఉల్లిపాయ ముక్కలు,వెల్లుల్లి, ముల్లంగి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
5. తర్వాత అందులో చింతపులుసు, టమోటో, ఉప్పు, ఒకకప్పు నీళ్ళు పోసి, వెజిటేబుల్స్ మొత్తగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.
6. ముల్లంగి మీడియంగా ఉడకగానే, అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న పప్పును వేసి మరో 5-10నిముషాలు ఉడికించుకోవాలి. అప్పుడే సాంబార్ పౌడర్ కూడా వేసి మరో పదినిముషాలు ఉడికించుకోవాలి.
7. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, వేడి వేడి రైస్ తో సర్వ్ చేయాలి. అంతే ముల్లంగా సాంబార్ రెడీ.

English summary

Radish Sambar Best Combination for Rice

Sambar is a traditional South Indian recipe. This is a curry where the pigeon peas is cooked and mixed with vegetables. There is a special powder called sambar powder which is prepared in most of the families and is added to the curry.
Story first published: Wednesday, April 23, 2014, 12:36 [IST]
Desktop Bottom Promotion