For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాజ్మా దాల్ మస్కా

|

Rajma dal Maska
కావలసిన పదార్థాలు:

రాజ్మా - 100 grm
వెన్న - 25 grm
మినుములు - 100 grm
అల్లం- కొద్దిగా
పసుపు - చిటికెడు
గరం మసాల - 2 tbsp
టమాట పేస్ట్ - 4 tbsp
కొత్తిమిర - కొద్దిగా
నూనె- 150 grm
ఉల్లిపాయలు -2
వెల్లుల్లి - 4
జీడిపప్పు- 4
ఉప్పు- రుచికి సరిపడా
గసగసాలు - 2 tbsp

తయారు చేయు విధానం: మొదటగా రాజ్మా, మినుములు, నీటిలో మూడు గంటల పాటు నానా బెట్టి తర్వాత ఉప్పు వేసి ఉడకించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి అర కప్పు నూనె వేసి కాగాక దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు వేయాలి. దీనిలో తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కారం, టమోటో పేస్ట్ వేసి బాగా కలియ బెట్టాలి. మొదట సిద్దం చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని కూడా పాన్ లో వేసి ఉడకనివ్వాలి. దీనికి జీడిపప్పు, గసగసాలు కలిపి పేస్ట్ చేసి ఇందులో వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. పైనల్ గా గరం మసాలా వేసి మరికొద్ది సేపు మగ్గనివ్వాలి. దీనిపై కొత్తిమిరి చల్లి, కొద్దిగా వెన్న కూడా వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.

Story first published:Wednesday, October 28, 2009, 17:52 [IST]
Desktop Bottom Promotion