For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాజ్మా సాండ్విచ్ : హెల్తీ బ్రేక్ ఫాస్ట్

|

రాజ్మా సాండ్విచ్ : హెల్తీ బ్రేక్ ఫాస్ట్

రాజ్మాలో రెండు రకాలు మనకు మార్కెట్లో లభ్యం అవుతాయి. ఒకటి తెల్లగా ఉండే రాజ్మా(కిడ్నీ బీన్స్)పంజాబ్ లో ఎక్కువగా పండిస్తారు. ఇక రెండవది రెడ్ రాజ్మా వీటిని కాశ్మిర్ లో ఎక్కువగా పండిస్తారు. అందుకే ఈ రెడ్ రాజ్మాను కాశ్మిర్ రాజ్మా మసాలా తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

ఇండియన్ కుషన్స్ లో రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ చాలా పాపులరైనటువంటి సైడ్ డిష్. ముఖ్యంగా రాజ్మా వంటలను నార్త్ స్టేట్స్ లో ఎక్కువుగా తయారుచేస్తారు. వీటిని బీన్స్ గా పిలుచుకొనే సౌత్ స్టేట్స్ లో కూడా వీటిని ఎక్కువగా వండుతారు. రాజ్మా పొట్టనిండినట్టు చేస్తే ఒక రిచ్ ఫుడ్ . వీటిని ఎక్కువగా రాత్రుల్లో డిన్నర్ కు ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. అలాగే రోజంతా హెల్తీగా ఉండేందుకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కూడా తీసుకుంటారు. మరి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొనే వారు రాజ్మా సాండ్విచ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక సారి ట్రై చేయండి.

Rajma Sandwich Recipe For Breakfast

కావల్సిన పదార్థాలు:

రాజ్మా: ½ cup (రాత్రంతా నీటిలో వేసి నానబెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పనీర్: 2tsp (తురుముకోవాలి)
దోసకాయ: 1tsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి :1 (సన్నగా తరిగినవి)
ఛాట్ మసాలా: చిటికెడు
కారం: ఒక చిటికెడు
బ్లాక్ ఉప్పు : ఒక చిటికెడు
చీజ్ స్ప్రెడ్: 1tsp
బ్రెడ్ స్లైస్: 8పీసులు
నిమ్మరసం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
బట్టర్ లేదా నెయ్యి: 1tbsp

తయారుచేయు విధానం :
1. ముందుగా కుక్కర్ లో రాజ్మా మరియు కొద్దిగా ఉప్పు వేసి 4విజిల్స్ వచ్చే ఉడికించుకోవాలి .
2. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కుక్కర్ లో ఆవిరి పోయే వరకూ ఉండి తర్వాత మూత తీసి నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ, కీరకాయ, పనీర్ మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి, అలాగే చాట్ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
3. అలాగే దీనికి రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ సాల్ట్ మరియు సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసి అందులో రాజ్మా వేయాలి. మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి.
4. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను తీసుకొని, బ్రెడ్ అంచులు, చివర్లు కట్ చేసి, బ్రెడ్ కు చీజ్ రాసి పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత ఒక్క బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద రాజ్మా మిశ్రమాన్ని వేసి బ్రెడ్ మొత్తం పరిచి దాని మీద మరో బ్రెడ్ స్లైస్ ను పెట్టి, స్టఫ్ చేయాలి.
6. ఇలా స్టఫ్ చేసిన బ్రెడ్ రాజ్మాను టోస్టర్ లో పెట్టి హీట్ చేయాలి. టోస్టర్ లో పెట్టే ముందు సర్ఫేస్ మీద కొద్దిగా బట్టర్ రాసి తర్వాత పెట్టి టోస్ట్ చేస్తే గోల్డ్ బ్రౌన్ కలర్ లో క్రిస్పీగా తయారువుతాయి. ఇలా అన్నింటిని తయారుచేసుకోవాలి. అంతే రాజ్మా సాడ్విచ్ రెడీ. దీన్ని ఉల్లిపాయ సలాడ్ మరియు టమోటో సాస్ తో సర్వ్ చేయాలి.

Desktop Bottom Promotion