For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రక్షాబందన్ స్పెషల్ : స్వీట్ పంప్కిన్ హల్వా

|

మన ఇండియన్స్ అందరికి అత్యంత ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఎందుకంటే శ్రావణ మాసంతో పండగల సీజన్ ప్రారంభ అవుతుంది. ఈ సమయంలో అనేక పండగలు రాబోతున్నాయి. ఇక రెండు మూడు నెలలు ప్రతి ఇంట్లోనూ పండగ వాతావరణం కనబడుతుంది.

సంతోషకరమైన వాతావరణంలో జరుపుకొనే పండుగల్లో రాఖీ పండుగ(రక్షాబందన్ కూడా ఒకటి). మన ఇండియన్స్ ఈ పండుగా సెలబ్రెషన్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మన ఇండియాలో మొత్తం ఈ పండుగను కొన్ని వేల సంవత్సరాల నుండి చాలా గొప్పగా జరపుకోవడం ఆనవాయితి.

మరి ఈ సంతోకరమైన వాతారవణంలో ఒక మంచి స్వీట్ ను ఆత్మీయులకు ముఖ్యంగా రక్షాబందన్ తో ముడిపడే అన్నదమ్ములు, అక్క, అన్న తమ్ముళ్ళు, కోసం ఇంట్లో తయారుచేసుకొని ఒక స్వీట్ డిష్ పంప్కిన్ హల్వా. వారి అన్నా, తమ్ముళ్ళకు ప్రేమన తెలియపరచడానికి ఒది ఒక ఉత్తమ మార్గం. మరికెందుకు ఆలస్యం . గుమ్మడి హల్వా తయారీలో లీనమవ్వండి...

Raksha Bandhan Special: Sweet Pumpkin Halwa Recipe

కావల్సినపదార్థాలు:
స్వీట్ పంప్కిన్(గుమ్మడికాయ ముక్కలు): 2cups(తురుముకోవాలి)
పాలు: 1cup
పంచదార: 1cup
నెయ్యి: 1cup
డ్రై గ్రేప్స్: 8-10
యాలకలపొడి: 1/4tbsp
జీడిపప్పు: 5-6
కుంకుమపువ్వు: కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ప్రెజర్ కుక్కర్లో గుమ్మడికాయ తురుము వేసి 2 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత కుక్కర్ క్రిందికి దింపుకొని, కుక్కర్ చల్లబడిన తర్వాత. ఉడికిన గుమ్మడికాయను పక్కన తీసి పెట్టుకోవాలి.
3. ఇప్పు ఒక పాన్ తీసుకొని అందులో 2 చెంచాలా నెయ్యి కాగిన తర్వాత అందులో గుమ్మడికాయ వేయాలి.
4. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. 5 నిముషాల తర్వాత 1 కప్పు పాలు పోసి, ఉడికించిచాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
5. ఇప్పుడు అందులో ఒక కప్పు షుగర్ వేసి మిక్స్ చేసి ఉడికించాలి.
6. 5నిముషాల తర్వాత కొద్దిగా కుంకుమపువ్వు, రెండు చెంచా నెయ్యి వేసి మిక్స్ చేయాలి.
7. తక్కువ మంట మీద ఉడికించడం వల్ల చిక్కబడుతుంది .
8. హల్వా చిక్కబడే సమయంలో అందులో యాలకలపొడి వేసి మిక్స్ చేసి మరో రెండు నిముషాలు ఉడికించాలి .
9. మరో చిన్న పాన్ లో రెండు చెంచాల నెయ్యి వేసి వేడి అయ్యక అందులో డ్రై గ్రేప్స్, జీడిపప్పు, బాదం వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి.
10. తర్వాత వీటిని ఉడుకుతున్న గుమ్మడి హల్వాలో వేసి మిక్స్ చేయాలి. అంతే హాట్ అండ్ స్వీట్ పంప్కిన్ హల్వా రిసిపి రెడీ.

English summary

Raksha Bandhan Special: Sweet Pumpkin Halwa Recipe

Raksha Bandhan Special: Sweet Pumpkin Halwa Recipe. The most loved season for all the Indians is shravan. During this time there are many festivals that are celebrated during this span of 3 to 4 months.
Story first published: Thursday, August 20, 2015, 14:16 [IST]
Desktop Bottom Promotion