For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రక్షాబందన్ స్పెషల్: గోంగూర చట్నీ రిసిపి

|

రక్త సంబందానికి రూపం రక్షా అత్మీయ బందానికి ఆదారం రాఖీ ఆ రెండింటి సమ్మిళితమైన తోబుట్టువుల తీయటి జ్ఞాపకం రక్షాబందన్‌ తరాలుమారిన తరగని వన్నేతో తారతమ్యం లేకుండా జరుపుకుంటున్న పండుగ రక్షాబందన్‌. తోబుట్టువుల అప్యాయత అనురాగం ఎప్పటికి ఎవ్వరు మరువలేరు ఈ అనుబంధానికి ప్రతికగా నిలిచే శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. దేశవ్యాప్తంగా పండుగరోజు అన్నదమ్ముళ్లకు అక్కాచెల్లెల్లు తప్పకుండా రాఖీలు కట్టాలని ఆరాటపడుతుంటారు.

అత్మీయతను పెంచే బందం మరింత బలపడాలంటే రక్షాబందన్ తో పాటు నోటికి కమ్మని రుచికరమైన వంటను రుచిచూపించాల్సిందే. ఎప్పడూ రెగ్యులర్ గా చేసుకొనే వంటలు కాకుండా, ప్రత్యేకంగా ఇలా శుభకార్యాలప్పడు డిఫరెంట్ వంటలను తయారుచేసుకుంటే ఆ అకేషన్ కే మరికొంత అనందం, ఆహ్లాదం తోడవుతాయి. మరి మీ తోబుట్టువులకు, అన్న, తమ్ములకు రక్షాబందన్ రోజున ప్రత్యేకంగా ఉండాలంటే ఒక స్పెషల్ వంటను రుచి చూపించండి. ఆంధ్రులకు అత్యంత ప్రీకరమైన వంట గోంగూర చట్నీ. ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్. తాజా గోంగూరతో తయారుచేస్తారు. మీ బ్రదర్స్ కు గోంగూరతో తయారుచేసే వంటలంటే మహా ఇష్టం అయితే. పుల్లగా, కారంగా ఉండే గోంగూర చట్నీతో రక్షాబందన్ సెలబ్రేట్ చేసుకోండి...

Rakshabandhan Special: Gongura Chutney Recipe

కావల్సిన పదార్థాలు:
గోంగూర: 1కట్ట( ఆకులు విడిపించుకోవాలి)
మెంతులు: కొద్దిగా
నూనె: సరిపడా
ఉద్దిపప్పు: 1tbsp
ధనియాలు: 1tbsp
కారం: 7-8
పచ్చిమిర్చి: 2
వెల్లుల్లి రెబ్బలు: 4-5
ఉప్పు రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా గోంగూరను విడిపించి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి మెంతులు, ధనియాలు, ఎండు మిర్చి ఒక నిముషం వేయించుకోవాలి. తర్వాత ఉద్దిపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసి ఒక నిముషం తక్కువ మంట మీద వేగించుకోవాలి. తర్వాత పాన్ లో నుండి తీసి, చల్లారనివ్వాలి.
3. అదే పాన్ లో గోంగూర ఆకలు వేసి కొద్దిగా నూనె వేసి అందులో గోంగూర వేసి కొద్దిగా వేగించుకోవాలి.
4. ఇప్పడు ముందుగా వేగించుకొన్నపదార్థాలన్నీ వేసి, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
5. ఇప్పుడు పాన్ వేడి చేసి మరో రెండు టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత అందులో కొద్దిగా పోపు వేసి వేగి తర్వాత చట్నీ వేసి బాగా మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే గోంగూర చట్నీ రెడీ.

English summary

Rakshabandhan Special: Gongura Chutney Recipe

Rakshabandhan is a special festival marking a strong bond between brothers and sisters. Needless to mentions that food forms the most crucial part of this festival like all others. Sisters love to feed their brothers their favourite food on this day.
Story first published: Wednesday, August 6, 2014, 17:48 [IST]
Desktop Bottom Promotion