For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోస్టెడ్ కార్న్ పాస్తా రిసిపి: స్పెషల్ టేస్ట్

|

కార్న్ పాస్తా రిసిపి హెల్తీ అండ్ టేస్టీ డిష్ . పాస్తా రిసిపిలలో మెయిన్ కోర్స్ పాస్తా రిసిపి. ఈ మద్యకాలంలో పాస్తా ఫేవరెట్స్ ఎక్కువ మంది అయిపోయారు. ముఖ్యంగా పాస్తా టేస్ట్ కోసమే దీనికి ఎక్కువ మంది ఫ్యాన్స్ . అంతే కాదు, పాస్తా రిసిపిలను చిటికెలో తయారుచేసుకోవచ్చు . పాస్తాలో కూడా వివిధ రకాలున్నాయి. ఇవి యమ్నీ టేస్ట్ కలిగి ఉంటాయి.

టమోటో పాస్తా రిసిపి-ఇండియన్ స్టైల్

పాస్తాలో కూడా చాలా డిఫరెంట్స్ రిసిపిలున్నాయి. అలాంటి వాటిలో ఒకటి కార్న్ పాస్తా. చాలా డిఫరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది. ఈపాస్తా రిసిపి యొక్క స్పెషాలిటి, ఇందులో రోస్ట్ చేసిన కార్న్ ను మిక్స్ చేయండం మరింత టేస్ట్ ను అందిస్తుంది. టేస్ట్ మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి . కార్న్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది గర్భణీ స్త్రీలకు చాలా ఆరోగ్యకరమైనది. ఇంకా ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగని ఎక్కువ కార్న్ ను తినడం గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. కార్న్ పాస్తా రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

Roasted Corn Pasta Recipe

కావల్సిన పదార్థాలు:
కార్న్ - 2 cups
పాస్తా - 300 gms
ఉల్లిపాయలు - 1 cup
టమోటో సాస్ - 2 teaspoons
వెనిగర్ - 2 teaspoons
మెయోనైజ్ - 1 teaspoon
పచ్చిమిర్చి - 4 to 5
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా

వెజిటేబుల్ పాస్తా సూప్...

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో ఆయిల్ వేయాలి(పాస్తా తయారుచేయడానికి ఎక్కువగా ఆలివ్ ఆయిల్ ను ఎంపిక చేసుకుంటారు)
2. నూనె వేడి అయ్యాక అందులో రెండు కప్పులు కార్న్ వేసి ఫ్రై చేసుకోవాలి.
3. లైట్ బ్రౌన్ కలర్ కు మారే వరకూ ఫ్రై చేసుకోవాలి. అయితే ఎక్కువ సేపు ప్రై చేయడానికి లేదు.
4. కార్న్ ఫ్రై చేసుకొన్న తర్వాత ప్లేట్ లోకి మార్చుకోవాలి .
5. ఇప్పుడు మరో పాన్ తీసుకొని పాస్తా మరియు సరిపడా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి .
6. పాస్తా ఉడుకుతున్న సమయంలో కొద్దిగా నూనె వేసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
7. పాస్తా మెత్తగా ఉడికిన తర్వాత అదనపు నీరు ఉంటే వంపేసి పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు, ఫ్రైడ్ కార్న్, టమోటో సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీస్ మరియు మెయోనైజ్ వేసి మిక్స్ చేయాలి.
9. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించుకొన్న పాస్తా వేసి సూట్ చేయాలి. అంతే రోస్టెడ్ కార్న్ పాస్తా రిసిపి రెడీ .

English summary

Roasted Corn Pasta Recipe

Roasted Corn Pasta Recipe, Pasta is a favourite dish for all and for many of us it is a saviour. The reason why it is liked the most is because of its taste and the ease with which it can be cooked in minutes. A huge variety of pasta makes us get more addicted to these yummy treats.
Story first published: Thursday, December 3, 2015, 15:14 [IST]
Desktop Bottom Promotion