For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాచులర్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ - అటుకులు - పుదీనా బాత్

|

ఆకు కూరల్లో పుదీనా ఆకుకు ప్రత్యేకమైన ఔషధ గుణాలున్నాయి. పలు రకాలైన రుగ్మతలకు పుదీనా మంచి మందు. అజీర్ణం, కుడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గడానికి పుదీనా రసం, నిమ్మరసం, తేనె ఒక్కొక్క చెంచా చొప్పున కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

పుదీనా ఆకుల ద్వారా ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు లభిస్తాయి, చట్నీ, పొడుల రూపంలోనూ, గారెలు, బిర్యానీ వంటి ఇతరత్రా వంటకాల్లో పుదీనాను చేర్చుకోవడం ద్వారా దంత సమస్యలకు చెక్ పెట్టవచ్చును. పుదీనాను ఆహారంలో చేర్చుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. ఆకలిని పెంచే పుదీనా ఆకులతో చట్నీ, పొడులు చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పుదీనా ఆకుల రసాన్ని రాసుకుంటే తలనొప్పికి చెక్ పెట్టవచ్చును. జ్వరం, దగ్గు, జలుబుకు పుదీనా దివ్యౌషధంగా పనిచేస్తుంది.

Simple and Flavorful-PuffedRice Mint Bath

అలాగే మహిళల్లో నెలసరి క్రమం తప్పితే, పుదీనా ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని తేనెలో కలిపి రోజూ మూడు పూటలా తీసుకుంటే సరిపోతుంది. పుదీనా ఆకులను ఒక గ్లాసు నీరులో ఉడికించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే బాగా ఆకలేస్తుంది. పుదీనాతో పాటు అల్లం, ఉప్పును చేర్చి రుబ్బుకుని ప్రతి రోజూ ఆహారంలో మూడు పూటలు తీసుకుంటే నోటి దుర్వాసన, అజీర్ణం, పిత్త సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చును. ఇన్ని సుగుణాలున్న పుదీనాతో వెరైటీ వంటకాలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూడండి

అటుకులు: 4- 5 cups
ఫ్రెష్ మింట్ (తాజా పుదీనా ఆకులు) : 1cup
ఉల్లిపాయ: 1 పెద్దది
టొమాటోలు: 1/2cup(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిరపకాయలు: 4 - 5(మద్యలోకి కట్ చేసుకోవాలి
జీడి: 10 - 15
జీలకర్ర: 1/2 tsp
పసుపు: పెద్ద చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్:1tbps

తయారు చేయు విధానం:
1. ముందుగా అటుకులకు నీటిలో వేసి ఒక నిముషం ఉండనిచ్చి తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
3. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడేవరకూ వేగించుకోవాలి. తర్వాత వెంటనే పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక నిముషం వేగనిచ్చి తర్వాత జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులో కట్ చేసుకొన్న టమోటో ముక్కలు వేసి వేగిస్తూ, రెండు నిముషాల తర్వాత పుదీ పేస్ట్ మరియు పసుపు వేసి పూర్తిగా వేగించుకోవాలి. టమోటో మొత్తబడేవరకూ వేగించుకోవాలి.
5. ఈ మిశ్రమం పచ్చివాసన పోయి టమోటో మెత్తగా ఉడికిన తర్వాత నానబెట్టి నీరు వంపేసి పక్కన పెట్టుకొన్న అటుకులు మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే అటుకుల పుదీనా బాత్ రెడీ..స్టౌవ్ కట్టేసి వేడి వేడిగా సర్వ్ చేయాల్సిందే ఆలస్యం..

English summary

Simple and Flavorful-PuffedRice Mint Bath | చిటికెలో రెడీ.. అటుకులు - పుదీనా బాత్


 This is a very simple and flavorful rice perfect for bachelors and busy women.
Story first published: Tuesday, May 7, 2013, 11:05 [IST]
Desktop Bottom Promotion