For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోయా కోకనట్ కర్రీ : గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకం

|

మహిళలకు గర్భధారణ ఒక కీలకమైన సమయం. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు వారి తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అలానే వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయాల్సి పనిలేదు. మరియు గర్భిణీలకు తయారుచేసే వంటలు అంత కష్టమూ కాదు. అయితే, గుర్తించుకోవల్సిన విషయమేంటంటే, గర్భిణీలు తీసుకొనే ఆహారంలో పూర్తి పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. ఈ పోషకాంశాలు, తల్లికాబోయా వారికి మరియు శిశువు ఆరోగ్య అభివృద్ధికి చాలా అవసరం అవుతాయి.

కడుపులో పెరిగే శిశువు పూర్తిగా తల్లి తీసుకొనే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఈ సమయం గర్భిణీలకు చాలా కీలకంగా భావిస్తారు. గర్భిణీలు తీసుకొనే ఆహారం ఖచ్చితంగా అన్ని పోషకాంశాలతో (విటమిన్స్, మినిరల్స్, ఫైబర్, ప్రోటీన్స్ మొదలగు)నిండి ఉండేవాటిని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వటువంటి వంటను కాబోయే తల్లి కోసం ఇక్కడ ఒక వంటను తయారు చేయబడింది. సోయా, కోకనట్ తో తయారుచేసే ఈ వంటి చాలా సింపుల్ గా తయారుచేయవచ్చు మరియు గర్భిణీలలో ఇది చాలా తేలికగా జీర్ణం అవుతుంది. మరియు ఈ వంటలో ఫాస్పరస్, ప్రోటీన్స్ మరియు ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంది. ఈ వంట ఆరోగ్యకరమైనది మాత్రమే కాకుండా, చాలా అద్భుతమైన రుచికలి ఉండి, టెప్ట్ చేస్తుంది. మరి ఈ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Soya n Coconut Curry For Pregnant Women

కావల్సిన పదార్థాలు:
సోయా కణికలు(సోయా గ్రానుల్స్): 2cups(గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి)
కొబ్బరి తురుము: ½cup
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
టమోటాలు: 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ఆవాలు: 1tsp
సోపు గింజలు: 1tsp
పసుపు: ½tsp
గరం మసాలా పొడి: 1tsp
కరివేపాకు: 5-6
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp
నీటి: ½cup

తయారుచేయు విధానం:
1. సోయా గ్రాన్యుల్స్ నానబెట్టుకొన్న నీటిని, పూర్తిగా వంపేసి, పక్కన పెట్టుకోండి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనెవేసి, వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు మరియు సోంపు వేసి ఒక నిముషం వేగించాలి
3. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద 5నిముషాలు వేగించుకోవాలి.
4. 5 నిముషాల తర్వాత టమోటో ముక్కలు, పసుపు, గరం మసాలా పౌడర్ వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకొన్న సోయా గ్రాన్యుల్స్ వేసి, బాగా మిక్స్ చేయాలి.
6. అలాగే కొబ్బరి తురుము, ఉప్పు, కూడా వేసి 3, 4నిముషాలు మిక్స్ చేస్తూ, వేగించి తర్వాత సరిపడా నీళ్ళు పోసి, 5నిముషాలు ఉడికించుకోవాలి.
7. ఒకసారి ఉడికించిన తర్వాత, స్టౌ ఆఫ్ చేసి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే సోయా మరియు కోకనట్ కర్రీ రెడీ. ఈ అద్భుతమైన రుచిని రోటీ లేదా పరోటాలతో సర్వ్ చేయండి..

English summary

Soya n Coconut Curry For Pregnant Women

Pregnancy is a crucial time for women. During this time the expecting mother should be very careful about her diet. It is not that cooking for pregnant women is difficult in any way. But one has to keep in mind that the diet of a pregnant woman should contain dishes which are full of nutrients.
 
Story first published: Monday, September 30, 2013, 13:27 [IST]
Desktop Bottom Promotion