For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెషల్ ఆలూ గ్రేవీ రిసిపి : టేస్టీ మీల్ డిష్

|

రుచికరంగా ఏదైనా తినాలని కోరుకుంటున్నారా?. మీ టేస్ట్ బడ్స్ కు కొత్త రుచిని చూపించాలంటే, రుచికరమైన పొటాటో గ్రేవీ రిసిపి ఒకటి . ఆలూ గ్రేవీ చాలా టేస్టీగా ఉండే చాలా సింపుల్ రిసిపి, దీన్ని చాలా సులభంగా తయారుచేయవచ్చు. ఆలూ వంటలంటే ఎక్కువగా ఇష్టపడే వారికోసం ఇలాంటి సింపుల్ వంటలు చాలా త్వరగా తయారుచేసుకొని, ఒక కొత్త రుచిని రుచి చూడవచ్చు.

ఈ వంటను తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే కొన్ని మసాల దినుసులు జోడించడం వల్ల వంట చాలా టేస్టీగా నోరూరిస్తుంటుంది. మరి మీరు కూడా ఈ వెరైటీ ఆలూ గ్రేవీని టేస్ట్ చేయాలంటే ముందుగా ఈ డిష్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Special Aloo Gravy Recipe : Telugu Vantalu

కావల్సిన పదార్థాలు:

  • బేబీ పొటాటోలు - 10
  • పెరుగు - 1 cup
  • పసుపు - 1 tsp
  • కారం - 2 tsp
  • ధనియాలపొడి - 2 tsp
  • గరం మసాల - 2 tsp
  • బట్టర్ - 2 tsp
  • జీలకర్రపొడి - 1 tsp
  • పెరుగు- 1 cup
  • ఉప్పు: రుచికి సరిపడా
  • నూనె: తగినంత

తయారుచేయు విధానం
1. ముందుగా ప్రెజర్ కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసి అందులో శుభ్రం చేసిన బేబీ పొటాటోలను వేయాలి. రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత గ్రేవీ తయారుచేసుకోవడానికి పాన్ తీసుకొని అందులో కొద్దినూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, పసుపు, గరం మసాలా, ధనియాలపొడి, బట్టర్ మరియు పెరుగు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
4. 5 నిముషాలు వేగించుకొన్న తర్వాత ప్రెజర్ కుక్కర్ లోని నీరు వంపేసి, బేబీ పొటాటోల మీద తొక్కను తొలగించి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో తొక్క తీసేసిన బేబీ పొటాటోలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
6. పొటాటోలు అన్ని వైపులా వేగిన తర్వాత వాటిని తీసి ఉడుకుతున్న గ్రేవీలో మసాలాలో వేసి మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకవోాలి.
7. చివరగా అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

English summary

Special Aloo Gravy Recipe : Telugu Vantalu

This is a beautiful looking dish! Mouthwatering dish. Learn how to make delicious Aloo Gravy with this easy Aloo Gravy recipe.
Story first published: Thursday, October 29, 2015, 14:19 [IST]
Desktop Bottom Promotion