For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోళీ స్సెషల్ : బెంగాలీ టేస్టీ వంటలు...

|

హోలీ విశ్వవాప్తంగా అద్భుతంగా జరుపుకొనే రంగుల పండుగ. మరి ఈ వారంలో మనల్ని కలర్ ఫుల్ గా పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ పండుగా రోజున, తేజం, వివిధ తరంగాలు, విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తాయి. అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషం. పురాణ కథలతో పాటుగా హోళి పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. హోళీ పండుగను వసంత బుతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది చలికాలం తొలగిపోయి ఎండకాలం ఆరంభానికి నాంది ప్రస్థానం వంటిది.

Holi Special Bengal Recipes

హోళీ పండుగను సాధారణంగా పాల్గుణ పౌర్ణమి' రోజున జరుపుకుంటారు. ఇలా ఓ రుతుబు వెళ్ళి మరో రుతువు చ్చే సమయంలో ముఖ్యంగా శీతాకాలం'చలి పోయి' ఎండాకాలం 'వేడి' వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడా వల్ల చర్మం చిట్లుతుంది. రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయని నమ్మకం.

ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట చేర్చారా అన్నంత ఆందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జరిపుకొనే హోళీ అంటే చిన్నా, పెద్దా అందరికీ ప్రియమే...! వయస్సుతో భేదం, ఆడ, మగా అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. మరి ఇటువంటి హోళీ రోజును కలర్ ఫుల్స్ స్వీట్ తోడైతే ఆ ఆనందాలకు అడ్డు ఏమి.. వచ్చిన బందువులతో హోళీ రంగు కేళీ.. జయహోళీ అవుతుంది. ఆడితే ఎలా ఆడాలీ?రంగుల వీధుల్లో ఈతకొట్టాలి.'వర్ణాలన్నీ' కలిసిపోవాలి. ఆడితే ఎలా ఆడాలీ?ముఖారవిందాలన్నీ మాయం అవ్వాలి. రెండుమూడు స్నానాలు అయ్యాకే అవి బైటపడాలి. ఆడితే ఎలా ఆడాలీ? అలసి కలసి ఒరిగిపోవాలి. హోమ్‌లీ స్పెషల్ వంటల్ని... షేర్ చేసుకోవాలి.

మటన్ కర్రీ : బెంగాలీ స్పెషల్ రిసిపి

మటన్ కర్రీ : బెంగాలీ స్పెషల్ రిసిపి

బెంగాలీయులకు అతి ప్రీతికరమైన వంట కోష మాంగ్షో. ఈ బెంగాలీ స్టైల్ మటన్ కర్రీ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. బెంగాల్ కోష మాంగ్షో అంటే చాలా నిధానంగా అంటే ఎక్కువ సమయం తక్కువ మంట మీద చికెన్ ఉడికించి తయారుచేస్తారు. ఈ మటన్ కర్రీనీ తయారుచేయడం చాలా సులభం మరియు చాలా సింపుల్ గా తయారుచేసే ఈ వంట రుచికరంగా ఉంటుంది.

Recipe:

డెలిషియస్ డిష్ బెంగాలీ స్టైల్ ఫిష్ బిర్యానీ రిసిపి

డెలిషియస్ డిష్ బెంగాలీ స్టైల్ ఫిష్ బిర్యానీ రిసిపి

బెంగాలీ ఫిష్ బిర్యానీ..ఆహా ఏమి రుచి..నోట్లో నీరూరించాలంటే ఈ బెంగాలీ డిష్ ను వండాల్సిందే. ఈ డెలిషియస్ బిర్యానీ ఇతర బిర్యానీలతో పోల్చితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ బిర్యానీలో మసాలాలు చాలా తక్కువగా ఉపయోగిస్తారు. అయితే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.#

Recipe:

ప్యాజ్: డెలిషియస్ బెంగాలి స్నాక్ రిసిపి

ప్యాజ్: డెలిషియస్ బెంగాలి స్నాక్ రిసిపి

వర్షాకాలం మొదలైంది, మనం రిలాక్స్ అవ్వాలంటే ఈ వర్షకాలం ఒక మంచి సమయం. వర్షకాలంలో రిలాక్స్ అవుతూ, బాల్కనీలు ఒక మంచి పుస్తకం చదువుతూ వేడి వేడి టీ త్రాగుతూ, అప్పుడుప్పుడు చిలకరి జల్లులను చూస్తూ, మద్యమద్యలో క్రిస్పీ స్నాక్స్ తింటుంటే ఎలా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షకాలంలో ఇటువంటి ఆహ్లదకరమైన సమయాన్ని మనందరు తప్పక ఇష్టపడుతాము. Recipe:

పనీర్ పోస్తో: రుచికరమైన బెంగాళి రిసిపి

పనీర్ పోస్తో: రుచికరమైన బెంగాళి రిసిపి

పనీర్ పాస్టో వెరీ సింపుల్ రిసిపి, ఈ వంట బెంగాల్ స్పెషల్ వంట. ఈ వంటకు చాలా తక్కువ పదార్థాలు మాత్రమే అవసరం అవుతాయి. మీరు ఏదైనా కొత్త వంటను రుచి చూడాలన్నప్పుడు, ఇటువంటి సింపుల్ రిసిపిలను ఎంపిక చేసుకోవచ్చు. Recipe:

బెంగాలీ స్వీట్ పులావ్ -స్పెషల్ రిసిపి

బెంగాలీ స్వీట్ పులావ్ -స్పెషల్ రిసిపి

బెంగాలీ మిష్టీ పులావ్(స్వీట్ పులావ్). ఇది రైస్ డిష్. మిష్టీ అంటే స్వీట్. బెంగాలీ మిష్టీ పులవ్ కొద్దిగా స్వీట్ గా ఆరోమాటింక్ గా మరియు మంచి సువాసన కలిగి ఉంటుంది. ఈ వంటను కొన్ని ప్రత్యే సందర్బాల్లో మాత్రమే వండుతారు. ముఖ్యంగా పండుగలు మరియు పెళ్ళిళ్ళకు ఎక్కువగా వండుతుంటారు. ఈ బెంగాలీ మిష్టీ పులావ్ యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ వంటను అలాగే ప్లెయిన్ గా తినవచ్చు లేదా మీకు నచ్చిన ఏదైనా గ్రేవీతో కూడా తినవచ్చు . Recipe:

బెంగాల్ స్టైల్ ఫ్రైడ్ కిచిడి

బెంగాల్ స్టైల్ ఫ్రైడ్ కిచిడి

ఇండియన్ కుషన్స్ లో అతి సులభంగా తయారుచేసే వంటకం కిచిడి. వంటచేయడానికి బద్దకించి ఉన్నప్పుడు, టేస్టీగా ఏదైనా వెంటనే తయారుచేసుకొని తినాలనుకున్నప్పుడు బియ్యం, పప్పు కుక్కర్ లో వేసి వండేసుకోచ్చు. ఇది ఒక ఆరోగ్యకరమైన హెల్తీ కుక్కింగ్ టిప్. కిచిడిని సులభంగా తయారుచేసుకోవచ్చు అనడం కంటే, జీర్ణక్రియ సమస్యలున్నవారికి చాలా తేలికగా జీర్ణం అయ్యే ఆహారంగా దీన్ని పరిగణించవచ్చు. జీర్ణం తేలిక మాత్రమే కాదు, ఇది చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.

Recipe:

బెంగాలీ స్టైల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ

బెంగాలీ స్టైల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ

గ్రీన్ వెజిటేబుల్స్ పుష్కలంగా దొరికే సీజన్ వింటర్. మార్కెట్లో, చిన్న చిన్నకూరగాయల అంగడిలో మొత్తం గ్రీన్ గ్రీన్ గా వెజిటేబుల్స్ కనబడుతుంటాయి. కాబట్టి, సీజనల్ గా దొరికే వివిధ రకాల కూరగాయాలను మర రెగ్యులర్ డైట్ లో పూర్తిగా చేర్చుకోవాలి. అప్పుడే మన శరీరానికి చేరాల్సి పోషకాశాలన్నీ అందుతాయి. ఒక్కో రకమైన కూరగాలతో వంట వండటం ఒక రుచి అయితే, మూడు, నాలుగు రకాల తాజా కూరగాయలు, వాటికి కొద్దిగా కూరాకు కూడా మిక్స్ చేస్తే చాలా అద్భుతమై రుచి ఉంటుంది. Recipe:

బెంగాల్ స్టైల్ గోబీ మలై కర్రీ -స్పెషల్ టేస్ట్

బెంగాల్ స్టైల్ గోబీ మలై కర్రీ -స్పెషల్ టేస్ట్

గోబీ మలై కర్రీ డిఫరెంట్ టేస్ట్ కలిగినటువంటి కాలీఫ్లవర్, ఫ్రెష్ క్రీమ్ తో తయారుచేసేటటువంటి వంట. ఇది ఒక టేస్టీ వెజిటేరియన్ కర్రీ. ఇందులో కొన్ని ఇండియన్ మసాలా దినుషులతో తయారుచేసిన పేస్ట్ తో తయారుచేయడ వల్ల మంచి టేస్ట్ తో పాటు ఆరోమా వాసన కలిగి ఉంటుంది. అటువంటి అద్భుతమైన వంటను ఈ రోజు మీకోసం పరిచయం చేస్తున్నాం. Recipe:

స్పైసీ బెంగాలీ ఫిష్ కర్రీ

స్పైసీ బెంగాలీ ఫిష్ కర్రీ

బెంగాలీ వంటలు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి . తయారుచేయడానిికి చాలా సింపుల్ గానే ఉండే వంటలు, రుచిలో మాత్రం గ్రేట్ గా ఉంటాయి . బెంగాలీ వంటల్లో ఫిష్ వంటలకు పత్యేక ప్రాధాన్యత ఉంది. స్పైసీ ఫిష్ వంటలో మస్టర్డ్ ఫిష్ కర్రీ చాలా ఫేమస్. దీన్నే బెంగాల్లో మచ్చర్ జాల్ అంటారు. ఈ మచ్చర్ జాల్ ఫిష్ కర్రీ చాలా సింపుల్ గా ఉంటుంది. Recipe:

English summary

Holi Special Bengal Recipes

Are you ready to celebrate the most colourful festival of the year? Yes, holi is one such festival that we all wait for and would love to celebrate it with our near and dear ones.
Desktop Bottom Promotion