For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెషల్ గోబి ఫ్రైడ్ రిసిపి : వీకెండ్ స్పెషల్

|

Rice(రైస్) తో వండే వంటలు ఎప్పుడూ చాలా సులభంగా మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు . ముఖ్యంగా పనిచేసే మహిళలకు రైస్ వరైటీ వంటలు చాలానే తెలిసి ఉంటాయి . అలాంటి రైస్ రిసిపిలలో టమోటో రైస్, ఆలూ రైస్, జీరా రైస్ చాలా సాధారణంగా చేసుకొనే వంటలు . కాల్లీఫ్లవర్ తో కూడా రుచికరమైన రైస్ రిసిపిని తయారుచేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా..; ఇది చాలా డిఫరెంట్ రిసిపి. ఈ వంటను ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు.అయితే వీకెండ్స్ కు కాస్త స్పెషల్ గా ఉంటుంది. కాబట్టి, ఈ లావంగ్ వీకెండ్ లో మీరు ట్రైచేసి కొత్త రుచిని ఆస్వాదించండి.

కాలీఫ్లవర్ పోషకాలు అధికంగా ఉన్న వెజిటేబుల్. ఇందులో విటమిన్ సి, కెలు మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి బెటర్ బ్లడ్ షర్కులేషన్ కు సహాయపడుతాయి. కాలీఫ్లవర్ గర్భినీ స్త్రీలకు చాలా ఉపయోగకరమైనవి . ఇది పొట్టలో పెరిగే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ మరియు ఫీటస్ హెల్త్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

Special Gobi fried Rice Recipe

కావల్సిన పదార్థాలు
కాలీఫ్లవర్ - 2 cups
రైస్- 2 cups
పచ్చిబఠానీలు - 1/2 cup
పచ్చిమిర్చి - 5 (సన్నగా తరిగినవి)
జీలకర్ర - 1/4th teaspoon
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1/4th teaspoon
గరం మసాలా - 1/4th teaspoon
కొత్తిమీర తరుగు - 1/4th teaspoon
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా అన్నం వండిపెట్టుకోవాలి.

2. తర్వాత పాన్ లో కొద్దిగా నీళ్ళు, పసుపు మరియు ఉప్పు వేసి అందులోనే కాలీఫ్లవర్ కూడా వేసి 10నిముషాలు ఉడికించుకోవాలి. 10 నిముషాలు ఉడికిన తర్వాత నీరు వంపేసి కాలీఫ్లవర్ ను పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు తిరిగా కాలీఫ్లర్ ను మంచి నీటిలో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ చల్లారిన తర్వాత నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి.

4. పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో కాలీఫ్లవర్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

5. మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పచ్చిబఠానీలు వేసి ఫ్రై చేసుకోవాలి.

6. ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న కాలీఫ్లవర్ ను వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక సారి వేగిన తర్వాత అందులోనే రైస్ వేసి ఫ్రై చేయాలి.

7. మొత్తం మిశ్రమం కలగలిసేటప్పుడు 1/4చెంచా గరం మసాలా మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.

8. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే యమ్నీ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ రైస్ రెడీ . దీన్ని లంచ్ లేదా డిన్నర్ కు సర్వ్ చేయవచ్చు

English summary

Special Gobi fried Rice Recipe

Special Gobi fried Rice Recipe, Recipe for gobi rice is famous in north India. Gobi rice is an Indian recipe. Cauliflower rice is called as gobi rice in India. It is one of the easiest rice recipes to make. This weekday, if you are wondering what to cook, then this gobi rice will be helpful. If you do not wan
Story first published: Saturday, August 13, 2016, 7:15 [IST]
Desktop Bottom Promotion