For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నూడిల్స్ మ్యాజిక్ : స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

నూడిల్స్ చాలా సులభంగా తయారుచేసుకొనే ఒక పాపులర్ స్నాక్ రిసిపి. అయితే , నిజానికి చెప్పాలంటే ఈ నూడిల్స్ రిసిపిలు కొన్ని డిన్నర్ రిసిపి, లంచ్ మరియు బ్రేక్ ఫాస్ట్ రిసిపిలకు కూడా మ్యాచ్ అవుతుంది.

ఈ ఆర్టికల్లో ఒక పాపులర్ నూడిల్ రిసిపి చూడవచచు. దీన్నే మనం నూడిల్ మ్యాజిక్ అని కూడా చెప్పవచ్చు . ఈ నూడిల్ మ్యాజిక్ రిసిపి ఖచ్చితంగా రుచికరమైనది ఉంటుంది. మీరు ఇప్పటివరకూ రుచి చూడని నూడిల్ రిసిపిలా ఉండే ఈ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Special Noodles Recipe : Noodles Magic

కావల్సిన పదార్థాలు:
నూడిల్స్ : 1ప్యాకెట్
మిక్స్డ్ వెజిటేబుల్స్: 1cup(క్యారెట్, పచ్చిబఠానీ మరియు బీన్స్)
ఉల్లిపాయలు: 2 -3
ఎంఎస్ జి: 1tsp
నూనె లేదా నెయ్యి: సరిపడా
టమోటో కెచప్: 1tbsp
చిల్లీ సాస్: 1tbsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: 2tbsp
నీళ్ళు: 2/3cup
కొత్తిమీర తరుగు: 1/2cup

తయారుచేయు విధానం:
1. ముందుగా వెజిటేబుల్ ముక్కలను నీళ్ళలో వేసి కొద్ది సమయం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ తీసుకొని తగినంత నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత అందుల కొత్తిమీర తరుగు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
4. తర్వాత అందులోనే సాస్ మరియు టమోటో కూడా వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
5. ఇప్పుడు ముందుగా ఉడికించుకొన్న వెజిటేబుల్స్ మరియు 3 కప్పుల నీళ్ళు పోసి మరో5 నిముషాలు ఉడికించాలి.
6. తర్వాత అందులో నూడిల్స్ వేసి మరో 3నిముషాలు ఉడికించుకోవాలి.
7. మొత్తం ఉడికించుకొన్న తర్వాత , ఉప్పు, మసాలా పౌడర్ జోడించడం వల్ల టేస్టీగా ఉంటుంది. అంతే సాస్ తో సర్వ్ చేయాలి.

English summary

Special Noodles Recipe : Noodles Magic

Noodles are easily the most popular snack recipes. As a matter of fact, noodles literally fits into almost every recipe classification- dinner recipes, lunch and breakfast recipes. In this article, we look at a popular noodles recipe that goes by the name of noodles magic. This noodles magic recipe will definitely be one of the tastiest noodles recipes you would've ever tasted.
Story first published: Friday, September 5, 2014, 9:25 [IST]
Desktop Bottom Promotion